సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం నాడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు విడుదల చేశాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. గతంలో సుధీర్‌బాబు-ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో సమ్మోహనం సినిమా తెరకెక్కి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ సినిమా నేపథ్యంలో రూపొందగా.. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ కూడా ఇదే కోవలోనే తెరకెక్కింది. వృత్తి రీత్యా డాక్టరైన కృతి శెట్టి సినిమాల్లో నటించడానికి అంగీకరించడం, సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్ సుధీర్ బాబు ఆమె నిర్ణయంతో సంబరంలో ఉన్నట్లుగా ట్రైలర్ ప్రారంభమైంది.
ఈ ట్రైలర్‌లో సుధీర్ బాబు యంగ్ ఫిల్మ్ మేకర్‌గా కనిపించాడు. భావోద్వేగాలను కూడా అద్భుతంగా చూపించాడు. అటు నటి కావాలని తపన పడే అమ్మాయిగా కృతి శెట్టి నటించింది. ఆమె పాత్ర కథపై ఆసక్తిని పెంచుతోంది. అయితే ఆమె హీరోయిన్ కావడం వాళ్ల నాన్నకు ఇష్టం లేదన్నట్లుగా ట్రైలర్‌లో చూపించారు. కమెడియన్ వెన్నెల కిషోర్ వినోదాన్ని పంచాడు. ఫిల్మ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. గత మూడు వారాలుగా టాలీవుడ్‌లో వరుస ఫ్లాపులు వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి ఫలితం సాధిస్తుందో వేచి చూడాలి. కాగా ఈ ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందని.. చూస్తుంటే ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉండేలా ఉందని మహేష్‌బాబు వ్యాఖ్యానించాడు.