ఈమధ్యకాలంలో తాము చేయాల్సిన పనికి కూడా లంచం ఇస్తేనే చేస్తున్నారు అధికారులు. తాజాగా 70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండె డ్ గా పట్టుబడ్డాడు విద్యుత్ ఏఈ. పొలం లో ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయుటకు రైతు వద్ద నుండి 70 వేల రూపాయలు. లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. ఏ.సి.బి డి.ఏస్.పి తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా జీలుగు మిల్లీ మండలం కనకాపురం గ్రామానికి చెందిన నల్లపు హనుమంతు రావు అనే కౌలు రైతుకు చెందిన పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు దర్భగూడెం విద్యుత్ ఏ. ఈ సాంబయ్య ను సంప్రదించారు,
దీంతో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు లక్షా ఇరవై వేలు ఇస్తే చేస్తామని చెప్పడం తో 50వేలు ముందుగా చెల్లిస్తే కనీసం ట్రాన్స్ఫార్మర్ అప్లికేషన్ అప్లోడ్ చేయకుండా మిగిలిన సొమ్ము కోసం వత్తిడి చేయడం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. 70 వేల రూపాయలు తీసుకుంటూ ఉండగా ఏఈ సాంబయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలియజేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అప్లికేషన్ ను స్వాధీనం చేసుకొని , రాజమండ్రి ఏసీబీ కోర్టులో ఏఈ సాంబయ్యను ప్రవేశపెడతామని ఎ.సి.బి డిఎస్పీ తెలిపారు.