అమరావతి రాజధాని రైతుల పిటిషన్‌లపై హైకోర్టులో విచారణ వాయిదా

0
534

అమరావతి రాజధాని రైతుల పిటిషన్‌లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌లపై హైకోర్టులో మంగళవారం నాడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజధాని పనుల పురోగతిపై ఏపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది. అయితే తాము మరో కోర్టు ధిక్కార పిటిషన్ వేశామని రైతుల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ స్టేటస్ రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై నిర్ణయం ప్రకటించాలని ఏజీ కోరారు. ఆ ఫైల్ వద్ద తమ వద్దే ఉందని.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు వెల్లడించింది. అయితే ఎల్పీఎస్ లే అవుట్లల్లో పనులు ఆలస్యం కావడంతో తమకు పరిహారం చెల్లించాలన్న పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని రైతుల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ హైకోర్టును కోరారు. దీంతో ఈ పిటిషన్‌ను పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 23వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here