అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ అల్లు అర్జున్ దంపతులు సందడి చేశారు. పుష్ప ఇచ్చిన జోష్ అల్లు అర్జున్ లో బాగా కనిపిస్తోంది.
తాజాగా అల్లు అర్జున్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి టూర్‌కు వెళ్లాడు. బన్నీ సతీమణి స్నేహారెడ్డి బర్త్ డే సందర్భంగా… పంజాబ్‌లోని అమృతసర్ గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లాడు. ప్రస్తుతం నెట్టింట బన్నీ ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
నలుగురు కలిసి గోల్డెన్ టెంపుల్ లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. సిక్కు సంప్రదాయ వస్త్రాలతో అల్లు వారి ఫ్యామిలీ హడావిడి అంతా ఇంతా కాదు. బన్నీ ఫ్యాన్స్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి అక్కడున్న వారు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.ఈ ఫోటోలు భారీగా షేర్ అవుతున్నాయి.