ఏపీలో పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ వైసీపీ నేతలు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రొజెక్ట్ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది.కాని అప్పటి టిడిపి ప్రభుత్వం కు చిత్తశుద్ధి లేదన్నారు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. తాను మూడు ప్రశ్నలు టీడీపీకి వేస్తున్నా అన్నారు. పోలవరం ప్రొజెక్ట్ ను కేంద్రం నిర్మిస్తానంటే…ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. 2018కి పూర్తి చేస్తామని చెప్పి ఎందుకు పూర్తి చేయలేదు. వాళ్లు చేయలేకపోవటానికి , ఈరోజు స్లోగా పనులు జరగటానికి కారణం డయాఫ్రం వాల్ అన్నారాయన.
కాపర్ డ్యాంల నిర్మాణం లేకుండా డయాఫ్రం వాల్ ఎందుకు నిర్మించారు? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. డయాఫ్రం వాల్ దెబ్బతిన్న అంశంపై పలు సందేహాలు ఉన్నాయన్నారు. అగాధాలు లోపల ఉన్నాయి. వరదల కారణంగా లోయర్ కాపర్ డ్యాం పనులు జరగలేదు. పోలవరం పూర్తి కాకపోవటానాకి చంద్రబాబు కారణం అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మాట్లాడం సరైంది కాదన్నారు అంబటి రాంబాబు.