తండ్రి ముందే పక్క చూపులు.. జైషాకు అమిత్‌షా క్లాస్‌

0
669

కొడుకు ఎవ్వరైనా సరే.. ఏ స్థాయిలో ఉన్నా సరే.. తండ్రి ముందు తింగర వేశాలు వేస్తే.. లాగి లెంపకాయ కొడతారు.. అది కుదరకపోతే.. సీరియస్‌గా వార్నింగ్‌ ఇస్తారు.. ఇప్పుడు.. బీసీసీఐ కార్యదర్శి జైషాకు అలాంటి పరిస్థితే ఎదురైంది.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన కుమారుడైన బీసీసీఐ సెక్రటరీ జై షాపై సీరియస్‌ అయ్యారు… ఇటీవల, ఒక వీడియో చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది.. తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వైరల్ అయిన ఆ వీడియోలో హోంమంత్రి అమిత్ షా తన కుటుంబంతో కలిసి ప్రార్థనలు చేస్తున్నట్టు ఉన్న దృశ్యాన్ని చూడవచ్చు. అమిత్‌షా పక్కనే నిలబడిన భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ సెక్రటరీ జై షాను కూడా మీరు చూడవచ్చు.

అయితే, ఓ వైపు పూజ జరుగుతుంటే.. ఆ సమయంలో తన దృష్టిని అక్కడ కేంద్రీకరించకుండా.. దిక్కులు చూస్తున్నారు జై షా.. దీంతో.. కుమారుడిపై కాస్త అసహనం వ్యక్తం చేసిన ఆయన.. “ఆమా ధ్యాన్ దే” (దీనిపై దృష్టి పెట్టు)” అంటే పూజా కార్యక్రమంపై దృష్టిసారించాలని అమిత్ షా తన కుమారుడు జై షాను గద్దించారు.. ఆ వీడియో వైరల్ గా మారిపోయింది.. తక్కువ సమయంలోనే లక్షల్లో వ్యూస్‌… వేలల్లో లైక్‌లు పొందింది.. ఎంతైనా.. బీసీసీఐ కార్యదర్శి అయినా.. ఓ తండ్రి కుమారుడేగా.. తండ్రి పక్కనుండగా దిక్కులు చూస్తే అలాగే ఉంటుంది మరి అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here