రైతుల ఫిర్యాదులపై సీఎం జగన్‌ సీరియస్‌..

0
891

తన దృష్టికి వచ్చిన ఆక్వా రైతుల సమస్యలపై సీరియస్‌ అయ్యారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వాటి పరిష్కారం కోసం ముగ్గురు మంత్రులు, సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.. ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్‌ పెంపుపై సీఎంకు రైతులు, రైతు సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు.. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని వాపోయారు.. ధరలు పతనమై నష్ట పోతున్నామన్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.. అలాగే ఆక్వాఫీడ్ విషయంలోనూ వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు పెంచారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.. అయితే, తన దృష్టికి వచ్చిన అంశాలను తీవ్రంగా పరిగణించి.. రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు సీఎం జగన్‌.

రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా సిండికేట్‌గా మారి రైతులను నష్టపరచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.. ముగ్గురు మంత్రులు, సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన ఆయన.. వారంరోజుల్లో నివేదిక అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు… నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.. ఇక, సీఎం వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన కమిటీలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజుతో పాటు సీఎస్‌, సీనియర్‌ అధికారులు విజయానంద్‌, పూనం మాలకొండయ్య, కన్నబాబు ఉన్నారు. కాగా, ఆక్వా రైతులు పలు సమస్యలతో సతమతం అవుతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లడంతో.. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న సీఎం.. వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here