ఏపీ ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పేరుతో పెళ్లి కానుక ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. వైఎస్సార్ కళ్యాణమస్తు కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష పెళ్లి కానుక ఇవ్వనున్నారు. కులాంతర వివాహం చేసుకున్న ఎస్టీ, ఎస్టీలకు రూ.1.20లక్షలు ఇవ్వనున్నారు. బీసీలకు రూ.50వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ.75వేలు ఇవ్వనున్నారు.
మరోవైపు పెళ్లిళ్లు చేసుకునే ముస్లింలకు రూ.1 లక్ష చొప్పున పెళ్లి కానుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి ఇచ్చే ఈ సాయానికి వైఎస్సార్ షాదీ తోఫా అని పేరు పెట్టింది. ఈ పథకం అమలు, విధి విధానాలకు సంబంధించి శనివారం రాత్రి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పథకాల అమలుతో 98.44 శాతం హామీలు నెరవేర్చామని జగన్ ప్రభుత్వం వెల్లడించింది.