వాయిదాల తర్వాత ఏపీ కేబినెట్ భేటీ నేడే..

0
528

సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. గత నెల చివరి నుంచి ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది కేబినెట్.. ఇవాళ ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాలపై మంత్రిమండలి చర్చించనుంది. ఈ నెల 19 నుంచి 24 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.బ్లాక్ 1లో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది.

ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన CPS అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే GPS అమలుపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి జీవోలను సైతం అధికారులు సిద్ధం చేశారు. అయితే ఇవాళ జరిగే కేబినెట్‌ భేటీలో ఆమోదించే అవకాశం ఉంది. దీనిపై మంత్రి బొత్స ఉపాధ్యాయ సంఘాలతొ చర్చించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా YSR హెల్త్ హబ్స్ ఏర్పాటుపైనా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు SIPBకి కేబినెట్ ఆమోదం తెలిపనున్నట్లు సమాచారం. ఇటీవల గ్రీన్ ఎనర్జీ రంగంలో 81వేల కోట్ల పెట్టుబడులతో పాటు మరిన్ని పెట్టుబడులకు SIPB గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here