మనసున్న మహారాజు సీఎం వైఎస్ జగన్.. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారుఅన్నమయ్య జిల్లా పర్యటనలో ఓ బాలుడి పరిస్థితి చూసి చలించిపోయారు.. 4వ దశ జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా.. మొహ్మద్ అలీ అనే బాలుడు దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్న విషయం తన దృష్టికి రావడంతో.. దయార్థ హృదయాన్ని చూపారు సీఎం.. వెంటనే బాధిత బాలుడి తల్లికి ఆర్థికంగా సాయం చేయాలని, నెలవారి పెన్షన్ వచ్చేలా చూడాలని.. ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం జగన్.. టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.. అక్కడికి హమీద అనే మహిళ మహ్మద్ అలీ అనే తన కుమారుడిని ఎత్తుకుని వచ్చారు.. తన బిడ్డ తలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడని, చికిత్స చేయించడానికి ఆర్ధికస్తోమత లేక ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.. వివరాలు ఆరా తీసిన పిదప.. విషయం అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. వెంటనే ఆమెకు ఆర్ధిక పరంగా సహాయం అందచేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ శ్రీ గిరీష వెంటనే స్పందించి కార్యక్రమ అనంతరం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రూ. 1,00,000 రూపాయల చెక్కును హమీదకు అందించారు. అలాగే నెలవారీ 3000 రూపాయల పింఛను అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మరోవైపు, స్విమ్స్‌లో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ సూచించారు.. తన మంచి మనసు చాటుకున్న సీఎం వైఎస్ జగన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు హమీద. మొత్తంగా.. మరోసారి.. తన గోల్డెన్ హార్ట్‌ను చాటుకున్నారు సీఎం వైఎస్ జగన్..