ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.. మూడు రాజధానుల విషయంలో హైకోర్టును ఇచ్చిన తీర్పును సుప్రీం హైకోర్టులో సవాల్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిన తర్వాత.. ఈ అంశంపై హైకోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదని ప్రభుత్వం పేర్కొంది… అయితే, రాజధాని అంశం చట్టం చేసే అధికారం శాసనసభకు లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.. కాగా, చట్టాలు చేయటానికి శాసనసభకు ఉన్న అధికారాలను హైకోర్టు ప్రశ్నించలేదన్నది ప్రభుత్వ వాదనగా ఉంది… అంతేకాకుండా.. రెండు రోజుల కిందట శాసన సభ సాక్షిగా అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
అయితే, మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిన తర్వాత ఈ అంశంపై హైకోర్టు విచారణ జరపడం రాజ్యాంగబద్ధం కాదని ఏపీ ప్రభుత్వం వాదనగా ఉంది.. రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికే ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.. రాజ్యాంగం ప్రకారం శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థలు తమ తమ పరిధిలో పనిచేయాలి… కానీ, రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు తీర్పు శాసనవ్యవస్థను నిర్వీర్యం చేయడమే అని ఏపీ సర్కార్ వాదన.. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలంటూ హైకోర్టు సూచించడం శాసన వ్యవస్థను ప్రశ్నించడమే నని.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని పిటిషన్‍లో పేర్కొంది ప్రభుత్వం.. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని.. ఆరు నెలల్లో అమరావతి అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలు సాధ్యం కానివని స్పష్టం చేసిన ఏపీ సర్కార్.. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరింది.