ఏపీలో వైద్యరంగానికి పెద్దపీట.. 16వేల కోట్ల వ్యయం

0
624

ఏపీలో వైద్యరంగానికి పెద్ద పీట వేస్తున్నామన్నారు మంత్రి విడదల రజనీ. రాష్ట్రంలో విషజ్వరాల పై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి వున్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహిస్తున్నాం. విషజ్వరాలపై అవగాహన కల్పిస్తున్నాం. వెక్టార్ కంట్రోల్ యాప్ తో అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. నాతో సహా అధికారులు రివ్యూ చేస్తున్నాం. పంచాయితీ రాజ్ అధికారులతో రివ్యూ చేశాం.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కోసం క్యాంపులు నిర్వహించాం. విషజ్వరాలపై ధైర్యంగా పోరాడుతున్నాం. సంధ్య మరణం కలచి వేసింది. ఇది బాధాకరం. సంధ్య తండ్రి కూడా అనారోగ్యంతో భద్రాచలంలో ఆస్పత్రిలో చేరారు. సంధ్యకు జ్వరం పెరగడం, ప్లేట్ లెట్స్ బాగున్నాయి. తండ్రీ కూతురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చింతూరు ఆస్పత్రికి సంధ్యను మళ్ళీ జాయిన్ చేశారు. సంధ్యకు బాగా లేకపోవడంతో సంధ్య మరణించింది. కానీ విపక్షాలు రాజకీయం చేస్తున్నారు.

నాడు నేడు కింద జగన్ పాలనలో వైద్యరంగంలో ఇన్ ఫ్ర్రాస్ట్రక్చర్ అందచేస్తున్నాం. అర్బన్ హెల్త్ ని నవీకరిస్తున్నాం. 344 యుపీహెచ్ లు కొత్తగా నిర్మిస్తున్నాం. ఇందుకోసం 399 కోట్లు ఖర్చుచేస్తున్నాం. పీహెచ్ సీలను 977 ..407 కోట్లతో ఆధునీకరిస్తున్నాం. వందలాది పీహెచ్ సీలకు కొత్త రూపు తెస్తున్నాం. 670 కోట్లు పీహెచ్ సీలకు ఖర్చుపెడుతున్నాం.

సెకండరీ హెల్త్ మార్చేస్తున్నాం. 528 కోట్లతో సీహెచ్ సీలకు ఆధునీకరణ చేస్తున్నాం. 1223 కోట్లు వైద్యరంగం గురించి ఖర్చుచేస్తున్నాం. పార్లమెంట్ సీటు పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయబోతున్నాం. 17 మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. 16 కాలేజీలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేశాం. చంద్రబాబు హయాంలో కొత్త మెడికల్ కాలేజీ పెట్టలేదు. టీడీపీ-బీజేపీ పొత్తు వున్నా ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేదని విమర్శించారు రజనీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here