రాజధాని అమరావతి కేసులపై విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

0
916

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులపై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణ పనులపై ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు దాఖలు చేసింది. ప్రభుత్వం వేసిన స్టేటస్ రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేయాలని రైతుల తరఫు అడ్వకేట్లకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై ఎవరైనా సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేశారా అని ధర్మాసనం ప్రశ్నించింది. రాజధాని రైతుల తరపు న్యాయవాదులు ఎస్ఎల్పీ వేశారని అడ్వకేట్ జనరల్ వివరించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము కోరిన అభ్యర్ధనలను తిరస్కరించారో వాటిపై మాత్రమే ఎస్ఎల్పీ వేశామని రాజధాని రైతుల తరపు అడ్వేకేట్ కోర్టుకు వివరించారు.

అటు ప్రభుత్వం వైపు నుంచి ఎస్ఎల్పీ వేశారా అని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసే అంశం ప్రాసెస్‌లో ఉందని ఏజీ తెలిపారు. సుప్రీంలో ఎస్ఎల్పీ విచారణ పెండింగులో ఉండగా హైకోర్టు విచారించడం భావ్యమా అని ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. తాము రైతుల నష్ట పరిహరం విషయంలో మాత్రమే సుప్రీంకు వెళ్లామని.. అది హైకోర్టులో విచారణకు ప్రతిబంధకం కాదని అడ్వకేట్ తరపు లాయర్లు వివరించారు. అనంతరం రాజధాని అమరావతి కేసులపై విచారణను హైకోర్టు అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. రాజధాని తీర్పుపై తాము సంతోషంగా ఉన్నామని రైతుల తరపు అడ్వకేట్ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here