12 ఏళ్ళనాటి ధరలతో పోలవరం నిర్మాణం ఎలా సాధ్యం?

0
998

లోపభూయిష్టమైన విధానాలతోనే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం మొదలైందన్న విజయసాయి రెడ్డి. 2010-11 నాటి ధరలకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. ఇది ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. 12 ఏళ్ళ క్రితం పెట్రోల్‌ ధర 50 రూపాయలు. ఇప్పుడు లీటరు పెట్రోలు 100 రూపాయలు. కానీ 2010-11 నాటి ధరే ఇప్పటికీ వర్తిస్తుందని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, 12 ఏళ్ళ క్రితం నిర్ణయించిన ధరలకే పోలవరం పనులు చేయాలన్న నిర్ణయం కూడా అంతే హాస్యాస్పదం అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.

2010-11 ధరలతో పనులు చేయడానికి ఏ కాంట్రాక్టర్‌ అయినా మొగ్గుచూపుతారా అని ఆయన ప్రశ్నించారు. ఈ విధంగా ప్రతి దశలో ఏదో ఒక మెలిక పెడుతూ అరకొర నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే పోలవరం ప్రాజెక్ట్‌ ఎలా పూర్తవుతుందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్యాయమైన, అశాస్త్రీయ విభజనతోనే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాల్సిందిపోయి కేంద్రం సవతి తల్లి వైఖరి అవలంభిస్తోందని విజయసాయి రెడ్డి విమర్శించారు.

అలాగే ప్రభుత్వ ఎరువుల పరిశ్రమలను ఎలా ప్రైవేటీకరిస్తారు?అని విజయ సాయి ప్రశ్నించారు. ద్రవ్యవినిమయ బిల్లుల్లో అనుబంధ పద్దుల కింద ఎరువుల సబ్సిడీ కోసం కేంద్రం లక్ష 9 వేల రూపాయలు కేటాయింపులు కోరుతోంది. ఇందులో దాదాపు నాలుగో వంతు నిధులు ఎరువుల దిగుమతి కోసం ఉద్దేశించినవే. అంటే ఎరువుల ఉత్పాదనలో “ఆత్మనిర్భర్‌” ఆవశ్యకతను నొక్కి చెబుతోందని విజయసాయి రెడ్డి అన్నారు. దేశంలో ఏటా 41.5 లక్షల టన్నులు ఎరువులు ఉత్పత్తి చేయాలన్న కేంద్ర లక్ష్యం నెరవేర లేదు. ఈ లక్ష్య సాధనలో ఇంకా 15 శాతం వెనుకబడి ఉంది.

ఎరువుల దిగుమతి బిల్లులను తగ్గించుకోవాలంటే దేశీయంగా ఉత్పత్తిని వేగవంతం చేయాలి. ఈ నేపథ్యంలో లాభాలలో నడుస్తున్న ఎనిమిది ప్రభుత్వ రంగ ఎరువుల తయారీ పరిశ్రమలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా సబబని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఈ ఎనిమిది పరిశ్రమలు కరోనా కాలంలో వేయి కోట్ల రూపాయల లాభాలను ఆర్జించాయని గుర్తు చేసిన విజయసాయిరెడ్డి. ఎరువుల ఉత్పాదనలో స్వయం సమృద్ధి సాధించాలని చెబుతున్న కేంద్రం, మరోవైపు ప్రైవేటీకరించాలని నిర్ణయించడంలో ఔచిత్యం ఏమిటో ఆర్థిక మంత్రి వివరించాలని కోరిన విజయసాయు రెడ్డి.

అదనపు ఖర్చులకు అనుబంద పద్దులు వున్నాయి కదా!

బడ్జెట్లో కేటాయింపులకు అదనంగా ఖర్చులు వచ్చినపుడు అనుబంధ పద్దుల ద్వారా వాటిని ఆమోదించకునే అవకాశం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 115 కల్పిస్తోంది. ఆర్థిక మంత్రి కూడా ఇదే నిబంధనను ఉటంకిస్తూ దేశంలో ఉత్పన్నమయ్యే పరిస్థితులకు అనుగుణంగా స్పందించేందుకే ఈ అనుబంధ ఖర్చులను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. అనుబంధ పద్దులలో అత్యధిక మొత్తాలు ఆహారం, ఎరువులు, ఇంధనం కోసం ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. అది సబబే. కానీ ఆర్థిక మంత్రి చెబుతున్న ఈ పరిస్థితులు అప్పటికప్పుడు ఉత్పన్నం అయినవి కావని పేర్కొన్న విజయసాయి రెడ్డి.

ఈ ఏడాది బడ్జెట్‌ ప్రవేశపెట్టే నాటికే ఈ పరిస్థితులు ఉన్నాయని అందుకే ఎరువుల సబ్సిడీని పెంచాలని ఈ ఏడాది మార్చిలోనే తాను ఇదే సభలో కేంద్ర ప్రభుత్వాన్ని అర్ధించానని గుర్తుచేసిన విజయసాయు రెడ్డి. కానీ దీనిపై స్పందించడానికి కేంద్రానికి 9 మాసాలు పట్టింది.అలాగే, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు పెంచాలని కోరుతూ మార్చిలో గ్రామీణాభివృద్ధి మంత్రిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశాను. దీనిపై స్పందించడానికి ప్రభుత్వానికి 9 నెలలు పట్టింది. సామాన్యుడిపై పెను భారంగా మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై పన్నులు తగ్గించాలని కూడా గత మార్చిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే దానిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి మూడు నెలలు పట్టిందన్న విజయసాయి రెడ్డి. బడ్జెట్‌లోనే ఈ మూడు రంగాలకు తగినంత కేటాయింపులు చేసే అవకాశం, పరిస్థితి ఉన్నా బడ్జెట్‌ మార్గం వదిలేసి అనుబంధ పద్దుల రూపంలో ఖర్చులకు నిధులు అడగడం సరైన పద్దతి కాదని అన్నారు.

దేశంలో క్షీణిస్తున్న తలసరి జీడీపీ-విజయసాయి రెడ్డి

జాతీయ స్థూల ఉత్పాదన”(జీడీపీ) విషయంలో దేశం యునైటెడ్‌ కింగ్‌డమ్‌ను అధిగమించినట్లుగా ఆర్థిక మంత్రి చెబుతున్నారు. కానీ తలసరి జీడీపీలో భారత్‌ ప్రపంచంలో 145వ స్థానంలో ఉంది. అదే యుకే 22వ స్థానంలో ఉంది. అంటే 67 కోట్ల జనాభా ఉన్న బ్రిటీషర్ల ఆర్థిక ఉత్పాదన 140 కోట్ల మంది భారతీయుల ఆర్థిక ఉత్పాదన కంటే ఎంతో ముందంజలో ఉన్నట్లేగా అని విజయసాయి రెడ్డి అన్నారు.గడచిన అయిదేళ్ళలో మన జీడీపీ 12 శాతం పెరిగితే తలసరి జీడీపీ మాత్రం కేవలం 7.6 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేసిన విజయసాయు రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here