ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోపై DGPకి మహిళా కమిషన్ లేఖ.. చర్యలు తీసుకోండి..!

0
848

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌.. ఓ మహిళలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌గా వీడియో కాల్‌ మాట్లాడిని వీడియో నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. దీంతో, ఎంపీ రాజీనామా చేయాలనే డిమాండ్‌ ప్రతిపక్ష టీడీపీ గట్టిగానే వినిపిస్తోంది.. మరోవైపు, అది ఫేక్‌ వీడియో, మార్ఫింగ్‌ చేశారంటూ సదరు ఎంపీ ఆరోపించారు.. దీని వెనుక కుట్ర దాగి ఉందంటూ టీడీపీ నేతలపై ఫైర్‌ అయ్యారు.. ఇక, దీనిపై విచారణ జరుపుతామని.. ఆ వీడియో నిజమేనని తేలితే.. ఎంపీ గోరంట్ల మాధవ్‌వై కఠిన చర్యలు తప్పవని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు చెబుతున్నమాట..

అయితే, ఇప్పుడు ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్ స్పందించింది.. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాసింది మహిళా కమిషన్‌.. మహిళా లోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలను త్వరగా నిగ్గు తేల్చాలని.. విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ. అయితే, ఎంపీకి సంబంధించిన అశ్లీల వీడియోపై మహిళా కమిషన్‌ కూడా స్పందించడంతో.. ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తప్పవా? అనే చర్చ మొదలైంది. మరోవైపు.. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఎంపీలతో సమావేశం కానున్నారు.. ఈ సమావేశానికి గోరంట్ల మాధవ్‌ను దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో, ఎంపీపై చర్యలు తీసుకునేందుకు సీఎం జగన్‌ సిద్ధం అవుతున్నారు అనే చర్చ సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here