ఏపీలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి. బిజెపి వైసిపి పాలన నుండి దేశ ప్రజలకు విముక్తి చేస్తాం అన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అవసరం ఎంతైనా ఉందన్నారు. నరేంద్ర మోడీ పాలనలో దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. బీజేపీ పాలనలో చేసిన అప్పు 109 లక్షల కోట్ల రూపాయలు అని తులసిరెడ్డి అన్నారు. ఇండియా ఫర్ సేల్ పెట్టిన ఘనత మోడీ, అమిత్ షా దే అని దుయ్యబట్టారు.
దేశాన్ని మోడీ, అమిత్ షా అమ్మితే అంబానీ, అదానీ కొనేస్తారన్నారు తులసిరెడ్డి. సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. ఏపీ రాష్ట్రంలో 5కోట్ల జనాభాలో 8 లక్షల కోట్టు అప్ఫ చేసిన ఘనత జగన్ దే అని ఎద్దేవా చేశారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి. ఇదిలా వుంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సాగే ఈ యాత్ర మధ్యలో ఏపీలోనూ సాగబోతోంది.
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఈ యాత్రలో భాగంగా ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ రెడీ అవుతోంది. అయితే ఈ యాత్రకు సీఎం జగన్ ఏపీలో అనుమతిస్తారా లేక ఆంక్షలు పెడతారా అనేది తేలాల్చి వుంది. 3500 కిలోమీటర్ల మేర సాగే ఈ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులో ప్రారంభం కానుంది. అనంతరం కేరళ, కర్నాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, చంఢీఘడ్ మీదుగా జమ్ము,కశ్మీర్ కు చేరుకుని అక్కడ ముగుస్తుంది. కేవలం ఐదు నెలల వ్యవధిలో ఈ యాత్ర పూర్తి అవుతుంది.
ఇదిలా వుంటే ఏపీలో నాలుగు రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగనుంది. ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 100 కిలోమీటర్ల మేర.. 4 రోజుల పాటు రాహల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఏయే తేదీలు అనేవి ప్రకటించలేదు. ఏపీలో రెండు లోకసభ నియోజకవర్గాలు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల గుండా రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈయాత్రలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొనేలా ఏపీసీసీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.