ఆత్మకూరులో ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్.. గెలుపెవరిది?

0
1080

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను అధికారులు ఓటింగ్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మొత్తం 64.1 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఓవరాల్‌గా పోలింగ్ శాతం 70 దాటుతుందని భావించినా అలా జరగలేదు. ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ నుంచి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో ఉండగా టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. బీజేపీ నుంచి జి.భరత్ కుమార్, బీఎస్‌పీ నుంచి ఎన్.ఓబులేసుతో పాటు మరో ఐదుగురు గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

కాగా ఆత్మకూరు ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. కొన్ని చోట్ల వైసీపీ-బీజేపీ కార్యకర్తల మధ్య చిన్నపాటి వాగ్వివాదాలు జరిగాయని.. మిగతా చోట్ల ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందన్నార. ఏడు చోట్ల ఈవీఎంలు, మరో చోట వీవీ ప్యాట్‌లలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయన్నారు. అనంతరం సమస్యను పరిష్కారం చేసి సజావుగా ఎన్నికలు నిర్వహించామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయని.. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను ఆత్మకూరు ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచామని తెలిపారు. గత ఎన్నికల్లో 82 శాతం పోలింగ్ జరిగిందని.. ఉప ఎన్నికల్లో సహజంగానే పోలింగ్ పర్సెంటేజ్ తగ్గుతుందని ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. అయితే గెలుపుపై వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. మెజారిటీ ఎంత వస్తుందనే విషయంపైనే వైసీపీ నేతలు ఆందొళన చెందుతున్నారు. మరోవైపు బీజేపీకి డిపాజిట్ అయినా దక్కుతుందో లేదో వేచిచూడాలని వైసీపీ నేతలు అంటున్నారు. ఈనెల 26న ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితంలో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here