కృష్ణా జిల్లా సర్పంచుల అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్. 2021- 22 ఆర్థిక సంవత్పరానికి సంబంధించి రెండవ విడత పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రూ,, 970 కోట్లు, అలాగే 2022 – 23 సం,, కు ఇవ్వవలసిన మొదటి, రెండు విడతల నిధులు రూ,, 2010 కోట్లు, మొత్తం రూ,, 2980 కోట్లను తక్షణమే అమ్మ గ్రామ పంచాయతీలకు విడుదల చేయవలసిందిగా రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సర్పంచులు తమను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన తమ గ్రామ ప్రజలకు కావాల్సిన మౌలిక, ప్రాథమిక సౌకర్యాలైన త్రాగు నీరు, రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్, లైటింగ్ మొదలగునవి ఏర్పాటు చేయలేక తీవ్ర మనోవ్యధకు సర్పంచులు గురవుతున్నారని, ఎన్నికలలో ఎన్నో హామీలిచ్చి గెలిచిన తర్వాత పనులు చేయడం లేదని ప్రజలు సర్పంచులను నిందిస్తున్నారని, అందుకే మా సర్పంచులు అధిక వడ్డీలకు అప్పులు చేసి డబ్బులు తీసుకొని వచ్చి గ్రామాలలో పనులు చేశారని, కానీ ఇటీవల 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ,, 344 కోట్లు, రూ,, 969 కోట్లు మొత్తం రూ,,1313 కోట్లను సర్పంచుల అకౌంట్ లల్లో నుంచి వారికి తెలియకుండా, వారి సంతకం కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసి వేసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిధుల దారి మళ్లింపు వలన మా సర్పంచులు అప్పులపాలై చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల సమస్యలను గుర్తించి పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఉద్యమాలు, పోరాటాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టం రఘురామ్, కృష్ణా జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణ రావు, ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులు బిర్రు ప్రతాపరెడ్డి (కర్నూల్ జిల్లా), యేజర్ల వినోద రాజు (విశాఖ జిల్లా),ముల్లంగి రామకృష్ణారెడ్డి (ఎన్టీఆర్ జిల్లా), సింగంశెట్టి సుబ్బరామయ్య (చిత్తూరు జిల్లా), అన్నెపు రామకృష్ణ నాయుడు (శ్రీకాకుళం జిల్లా), చుక్కా ధనుంజయ్ యాదవ్ (చిత్తూరు), మునిరెడ్డి (కడప జిల్లా), మూడే శివ శంకర్ యాదవ్, వాసం మునయ్య, బత్తిన దాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.