అది రికార్డుల లడ్డూ.. రికార్డు సృష్టించాలన్నా..? తిరగ రాయాలన్నా బాలాపూర్‌ గణేష్‌కే సాధ్యం..

0
777

రికార్డు సృష్టించాలన్నా ఆయనే.. అది తిరగ రాయాలన్నా ఆయనే.. అట్లుంటది మరి బాలాపూర్‌ గణేష్‌ అంటే.. ఎందుకంటే.. మరోసారి బాలాపూర్‌ గణేష్‌.. తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు.. ఈ సారి ఏకంగా రూ.20 లక్షల మార్క్‌ కూడా క్రాస్‌ చేసింది గణేష్‌ లడ్డూ.. కరోనా మహమ్మారి కారణంగా 2020లో వేలం పాటను రద్దు చేశారు.. ఇక, గత ఏడాది రూ. 18.90 లక్షలుగా పలికింది బాలాపూర్‌ గణపతి లడ్డూ.. ఈసారి.. గత రికార్డును బ్రేక్‌ చేస్తూ.. రూ.24.60 లక్షలుగా పలికింది.. మొత్తం 9 మంది ఈ సారి లడ్డూ కోసం పోటీ పడ్డారు.. మొదటగా రూ.19 లక్షలు డిపాట్‌ చేసి వేలంలో పాల్గొనగా చివరకు వేలం పాటలో రూ. లక్షలకు లడ్డూనూ దక్కించుకున్నారు వంగేటి లక్ష్మారెడ్డి.. లక్షా రూ.116తో ఈ ఏడాది లడ్డూ వేలం పాటను ప్రారంభించారు నిర్వాహకులు.. లడ్డూ కోసం పోటాపోటీగా సాగిన వేలంలో.. చివరకు వంగేటి లక్ష్మారెడ్డి బాలాపూర్‌ గణేష్‌ లడ్డూను సొంతం చేసుకున్నారు. దీంతో, ఆయనకు లడ్డూను అందజేశారు బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ సమితి నిర్వాహకులు..

బాలాపూర్‌లో 1994లోనే గణేష్‌ లడ్డూ వేలాన్ని ప్రారంభించారు.. తొలిసారి కొలను మోహన్ రెడ్డి.. రూ.450కు వేలంలో కొనుగోలు చేశాడు.. 1995లోను ఆయనే రెండోసారి రూ.4,500కు లడ్డూను దక్కించుకున్నాడు. ఇక,కొలను కృష్ణారెడ్డి 1996లో 18వేలకు, 97లో 28 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు. 1998లో మరోసారి లడ్డూ కొలను మోహన్‌రెడ్డికి దక్కింది. 1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి 65వేలకు, 2000లో కల్లెం అంజిరెడ్డి 66వేలకు, 2001లో రఘునందన్ చారి 85వేలకు లడ్డూను దక్కించున్నారు. 2002లో తొలిసారి లక్ష రూపాయలు దాటింది. ఆ ఏడాది లక్షా 5వేలకు లడ్డూను దక్కించుకున్నారు కందాడ మాధవ రెడ్డి. 2003లో చిగిరింత బాల్ రెడ్డి లక్షా 55వేలకు, 2004లో కొలను మోహన్ రెడ్డి 2లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డూను గెల్చుకున్నారు. 2005లో ఇబ్రహీం శేఖర్ 2లక్షల 8వేలకు దక్కించుకోగా… 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి లడ్డూ ధరను 3లక్షలకు పెంచారు.

అయితే, అప్పటివరకు వేలల్లో పెరిగిన లడ్డూ ధర 2007 నుంచి లక్షల్లో పెరిగింది. 2007లో రఘునందన్ చారి 4 లక్షల 15 వేలకు అంటే అంతకుముందు ఏడాదికంటే ఏకంగా లక్షా 15 వేలు అధికంగా పాడి లడ్డూను గెల్చుకున్నారు. 2008లోనూ కొలను మోహన్ రెడ్డి 5లక్షల 7వేలకు మరోసారి లడ్డూను దక్కించుకున్నారు. 2009లో 5లక్షల 15వేలకు లడ్డూ ప్రసాదాన్ని సరిత దక్కించుకోగా… 2010లో కొడాలి శ్రీధర్ బాబు 5లక్షల 35వేలకు, 2011లో కొలన్ బ్రదర్స్ 5 లక్షల 45వేలకు సొంతం చేసుకున్నారు. ఇక 2012 నుంచి ఈ లడ్డూ రేట్‌ ఏకంగా 2లక్షలు జంప్ అయింది. ఆ సంవత్సరం పన్నాల గోవర్ధన్ రెడ్డి 7లక్షల 50వేలకు దక్కించుకోగా… 2013లో తీగల కృష్ణారెడ్డి మరో 2లక్షలు పెంచేసి 9లక్షల 26వేలకు సొంతం చేసుకున్నాడు. 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 9లక్షల 50వేలకు వేలం పాడగా.. 2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి 10 లక్షల 32వేలకు గెలుచుకున్నాడు. ఇక 2016లో ఏకంగా 4లక్షలు పెంచిన స్కైలాబ్ రెడ్డి.. 14లక్షల 65వేలకు లడ్డూను దక్కించుకున్నాడు. 2017లో నాగం తిరుపతిరెడ్డి 15లక్షల 60వేలకు, 2018లో శ్రీనివాస్ గుప్తా 16లక్షల 60వేలకు, 2019లో కొలను రామిరెడ్డి 17లక్షల 67వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా.. 2020లో లడ్డూ పాట వేలాన్ని రద్దు చేసింది బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ సమితి.. ఇక, 2021లోనూ తనకు ఏ మాత్రం క్రేజ్‌ తగ్గలేదని నిరూపించుకున్నారు బాలాపూర్‌ గణేష్‌.. ఈ ఏడాది రూ.18.90 లక్షలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు ఏపీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, నాదర్‌గుల్‌కు చెందిన మర్రి శషాంక్‌రెడ్డి.. ఇక, ఈ ఏడాది ఆ రికార్డు కూడా బ్రేక్‌ అయిపోయింది.. రూ. 20 లక్షల మార్క్‌ను క్రాస్‌ చేసి.. రూ.రూ.24.60లక్షలుగా పలికింది. బాలాపూర్‌ గ్రామానికి చెందిన వంగేటి లక్ష్మారెడ్డి ఈ సారి లడ్డూ దక్కించుకున్నారు.. రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా ఉన్నారు వంగేటి లక్ష్మారెడ్డి. మొత్తంగా బాలాపూర్‌ వాసులకే మరోసారి బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ దక్కినట్టు అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here