కర్నాటక ఎన్నికలపై హైదరాబాద్‌లో జోరుగా బెట్టింగ్‌..

0
63

కర్నాటక ఎన్నికల్లో గెలుపోటములపై తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల బెట్టింగ్ లు జరుగుతున్నాయి. విషయం ఏదైనా సరే పందెం కట్టడం అలవాటైన తెలుగు పందెం రాయుళ్లు.. కర్నాటక ఎన్నికలనూ వదలడం లేదు. ప్రచారం ప్రారంభం కాక ముందు నుంచే మొదలైన పందేలు.. ఇప్పుడు పీక్స్ కు చేరాయి. పోటాపోటీ ప్రచారం సాగడంతో పందెం రాయుళ్లు వ్యూహాలు మార్చుకుంటున్నారు.

గత నెలలో కాంగ్రెస్ కు వంద నుంచి 103 సీట్లు వస్తాయని మొదలైన పందేలు ఇవాళ్టికి 114-116 మధ్య వస్తాయని బెట్టింగ్స్ వేస్తున్నారని సమాచారం. బీజేపీకి వంద సీట్లు వస్తాయని మొదట్లో జరిగిన పందేలు ప్రస్తుతం 80-82 వస్తాయని జరుగుతున్నాయి. జేడీఎస్ కు మొదటి నుంచి 21-23 మధ్యే సీట్లు వస్తాయని బెట్టింగ్స్ వేస్తున్నారు. రూపాయికి రూపాయి చొప్పున ఈ బెట్టింగ్స్ ఉంటున్నాయి. బెట్టింగ్ లకు కేంద్రమైన భీమవరం లో కోట్లలో లావాదేవీలు నడుస్తున్నాయని చెబుతున్నారు.

మొదటి నుంచి బీజేపీ వెనుకబడి ఉందనే అంచనాల్లో కొందరు ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం తర్వాత మొత్తం సీన్ మారిపోయిందంటూ.. బెట్టింగ్ చేస్తున్నారు. కర్నాటకలో ఎలాగైతే పోటాపోటీగా ఉందనే అంచనాలు వస్తున్నాయో.. బెట్టింగ్ లు కూడా అంతే పోటాపోటీగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని కొంపల్లి, కూకట్ పల్లి, గచ్చిబౌలీ ప్రాంతాల్లో జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి. పోలింగ్ సరళిని బట్టి కూడా బెట్టింగ్ లలో ఎత్తులు మారిపోనున్నాయి. అంతేకాదు.. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కూడా బెట్టింగ్స్ జరుగుతుంటాయి. గతంలో జరిగిన దుబ్బాక, హుజూర్ నగర్, మునుగోడు లలో కోట్లాది రూపాయల పందేలు నడిచాయి. అవే బ్యాచ్ లు ఇప్పుడు కర్నాటక ఫలితాలపై పందేలు కాస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here