రాజ్యాంగ రక్షణ కోసమే రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కొద్ది రోజుల్లో మన రాష్ట్రంలోకి భారత్ జొడో యాత్ర చేరుతుందన్నారు. అప్పుడు ఉప్పెనలా జనం తరలి రావాలని పిలుపు నిచ్చారు భట్టి విక్రమార్క. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్సి ప్రేమ్ సాగర్ రావ్ బతుకమ్మ చీరల పంపిణి చేపట్టారు.
దీనికి కాంగ్రెస్ పార్టీ నేత లు ఏఐసిసి సెక్రెటరీలు రోహిత్ చౌదరి, నదిం జావిద్, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి వినోద్, ఎక్స్ ఎంపి మధుయాష్కీ గౌడ్, టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ నిరంజన్, ప్రజా గాయకుడు గద్దర్ చేతుల మీద మహిళల కు చీరలను పంపిణి చేసారు. ఇందులో బట్టి మాట్లాడుతూ తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం.రాష్ట్రం తెచ్చుకున్నది అప్పుల పాలు చేసుకోవడం కోసం కాదు. మనమంతా అప్పుల పాలు అయ్యాము.ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారనీ మండి పడ్డారు.
కేంద్ర ప్రభుత్వం దేశ సంపదలను కొల్లగొట్టి కార్పొరేట్ కు దారా దత్తం చేస్తుందని మోది పాలనలో భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పై దాడి జరుగుతోందని రాజ్యాంగ రక్షణ కోసమే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నేడు కెసిఆర్ పాలనలో అంధకారంలో మునిగి తేలుతుందని దుయ్యబట్టారు. తెలంగాణా రాష్ట్రం ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుతో ముందుకు సాగుతుందని విమర్శించారు.