కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ మధ్య కుదిరిన పొత్తు.. బీజేపీ సంచలన వ్యాఖ్యలు..

0
577

కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి.. కాంగ్రెస్.. బీఆర్ఎస్‌తో పొత్తుకు అంగీకారం తెలిపిందని వార్తలు వస్తున్నాయన్న ఆయన.. ఈ విషయాన్ని మేం ఎప్పుడో చెప్పాం అన్నారు.. అధికారం కోసం వాళ్లిద్దరూ ఒక్కటి అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు.. ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టడం చూస్తుంటే.. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మోరిగినట్టు ఉందని విమర్శలు గుప్పించారు.

మరోవైపు.. రేపు తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించనున్నట్టు వెల్లడించారు ప్రేమేందర్‌రెడ్డి.. ఈ సమ్మేళనాన్ని ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ గా సందేశం ఇస్తారని తెలిపారు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బూత్ కమిటీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారని.. జూబ్లీ హిల్స్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గద్వాల్ లో డీకే అరుణ, ముషీరాబాద్ లో డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొంటారని వివరించారు.. ఇక, రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వం పట్ల తీవ్ర విముఖతతో ఉన్నారని.. కేసీఆర్‌ కేవలం కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని ఆరోపించారు.. తెలంగాణ ప్రజలు ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ వైపు చూస్తున్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here