తెలంగాణ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఎపిసోడ్ నడుస్తోంది. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు. ఈ రాష్ట్ర చిన్న ముఖ్యమంత్రి, మురికివాడల మంత్రి, చదువుకున్న మంత్రి కేటీఆర్. నిన్న అయన తెలిసి మాట్లాడారా , రాజ్యాంగ పరిధిలు తెలియక మాట్లాడారా? ఫైనాన్స్ కమిషన్ నిర్ణయం మేరకే రాష్ట్రాలకు నిధులు వస్తాయి. మీ నాన్న కేంద్ర మంత్రి గా ఉన్నపుడు … 32 శాతం మాత్రమే రాష్ట్రాలకు వచ్చేది … అప్పుడు ఎందుకు మాట్లాడలేదు.. నిద్ర పోయాడా? ఇప్పుడు మోడీ సర్కార్ దాన్ని 42 శాతం కి పెంచింది
మీకిస్తెనే ఇచ్చినట్టా.. కిసాన్ సమ్మాన్ నిధి, ఎరువుల సబ్సిడీ కేంద్రం డైరెక్ట్ గా ఇస్తుంది… ఉచిత బియ్యం ఇస్తుంది.. ఇవి నీ లెక్కల్లో ఉన్నాయా? తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నావు? ఇక్కడ ఉన్న సంస్థలకు ఇస్తే ప్రజలకు ఇచ్చినట్టు కాదా? Ghmc ప్రజల నుండి కలెక్ట్ చేస్తున్న డబ్బులు ghmc లోనే ఖర్చు పెడుతున్నారు. సిద్దిపేట ,గజ్వేల్, సిరిసిల్ల లో ఖర్చు పెడుతున్నట్టు గా దుబ్బాక లో ఎందుకు ఖర్చు పెట్టడం లేదు. నరేంద్ర మోడీ కి మీ లాగా చింతమడకలు లేవు. స్వార్థ పూరిత ఆలోచనలు ఆయనకు లేవు. మీ లాగా దుర్మార్గపు చర్యలు మోడీ చేయలేదు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు లను కాకుండా ఏ బిజెపి పాలిత రాష్ట్రాని కైన అదనంగా ఇచ్చిందా? సొల్లు మాటలు వదిలి పెట్టి చింతమడక లో ఖర్చు పెట్టినట్టు ఇతర ప్రాంతాల్లో ఎందుకు ఖర్చు పెట్టలేదో చెప్పాలి…తెలంగాణ లో హైదారాబాద్ తప్ప ఇంకో స్టేట్ ఉందా.. చిన్న రాష్ట్రాల్లో ఎక్కువ airport లు ఉన్నాయి… ఇక్కడ ఎందుకు లేవు. వరంగల్, ఖమ్మం ఎందుకు అభివృద్ధి చేయలేదు… మునిసిపల్ మంత్రి గా ఏమి చేశావు అని ఆయన ప్రశ్నించారు.