పోలీస్ ఈవెంట్స్ లో పాల్గొన్న అభ్యర్థి మృతి

0
1408

పోలీస్ ఉద్యోగాలు కొంతమంది యువతకు శాపంగా మారాయి. రిక్రూట్ మెంట్ లో భాగంగా నిర్వహిస్తున్న ఈవెంట్స్ లో పాల్గొంటున్న అభ్యర్ధులు కొందరు అనారోగ్యం బారిన పడుతున్నారు. మరికొందరు తిరిగిరాని లోకాలకు చేరుకుంటున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండల కేంద్రంలో విషాదం నెలకొంది. మండల‌ కేంద్రానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థి లింగమల్ల మహేశ్ (26) అనే యువకుడు హైదారాబాద్ లో పోలీస్ ఈవెంట్స్ కు వెళ్లి ఈ రోజు గుండెపోటుతో మృతిచెందాడు.

పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం జరిగిన ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గత కొన్ని నెలల నుండి ఈవెంట్స్ (రన్నింగ్) లో గెలుపొందాలని హైదరాబాద్ లో శిక్షణ పొందాడు. కాగా శనివారం హైదరాబాద్ లో జరిగిన కానిస్టేబుల్ ఈవెంట్స్ లో 1600 మీటర్లు పూర్తి చేసి గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.దీంతో మహముత్తారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here