మళ్లీ వైజాగ్‌ నుంచే పోటీ..

0
1122

గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ.. ఓటమిపాలయ్యారు.. ఆ తర్వాత కొంతకాలం.. రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించినా.. ఆ తర్వాత దూరం అయ్యారు.. అయితే, మరోసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నట్టు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.. విశాఖ నుంచే మరోసారి పార్లమెంట్‌కు పోటీ చేస్తానని ఆయన మీడియా చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు.. మన వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం కూడా ఉందని గుర్తుచేసిన ఆయన.. నేను ఏపార్టీ నుంచి పోటీ చేస్తానో.. సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం జరుగుతుందన్నారు.. అయితే, నా భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీ వైపే ఉంటానని స్పష్టం చేశారు.. గత ఎన్నికల్లోనే బాండ్ పేపర్ రాశాను.. తాను అనుకున్నది చేయలేకపోతే క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పానని గుర్తుచేసుకున్నారు లక్ష్మీనారాయణ.

మరోవైపు.. రెండు రాష్ట్రాలు కలవడం బాగానే ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వీవీ లక్ష్మీనారాయణ.. రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో నడుస్తోంది.. అన్ని పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడితే సమస్యలే ఉండబోవన్నారు.. కాగా, గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ.. కనీసం గట్టిపోటీ ఇవ్వలేకపోయారు.. టీడీపీ అభ్యర్థిపై.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తే.. లక్ష్మీనారాయణ మూడోస్థానానికే పరిమితం అయ్యారు.. అయితే, ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నాను.. విజయం సాధించిన నరేంద్ర మోడీ, వైఎస్‌ జగన్‌కు అభినందనలు.. తనపై విజయం సాధించిన ఎంవీవీ సత్యనారాయణను కూడా ఆయన అభినందిస్తూ.. ఎన్నికల ఫలితాల తర్వాత ట్వీట్‌ చేసిన విషయం విదితమే.. అంతేకాదు, తనకు ఓటేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజలకు సేవ చేసే విషయమై తనపని తాను చేసుకు వెళతానని పేర్కొన్నారు.. అయితే, ఇప్పుడు మరోసారి ఎన్నికల్లో పోటీపై మాట్లాడడంతో.. ఈ సారి ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది ఉత్కంఠగా మారింది. మరి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఈ సారైనా చట్టసభల్లో అడుగుపెడతారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here