నెల్లూరు సినతల్లి పద్మ అంటూ చంద్రబాబు అభినందనలు

0
729

నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నారాయణ మృతి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం కలిగించింది . భర్త నారాయణ మరణం పై పోరాడిన పద్మ `నెల్లూరు సినతల్లి` అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. న్యాయం కోసం జై భీమ్ సినిమా తరహాలో దళిత మహిళ పద్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం అంటూ చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఆమె నెల్లూరు సినతల్లి. భర్త మరణంపై అలుపెరగని పోరాటం చేసిన నెల్లూరుకు చెందిన దళిత మహిళ పోరాటాన్ని అభినందిస్తున్నాను.

బెదిరింపులకు బెదరక… ప్రలోభాలకు లొంగక భర్త ఉదయగిరి నారాయణ మృతిపై పద్మ చేస్తున్న పోరాటం జైభీమ్ సినిమాలోని సినతల్లిని తలపిస్తుంది. భర్త మరణంపై జైభీమ్ సినిమా తరహాలో నారాయణ భార్య పద్మ న్యాయం కోసం చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకం.పొదలకూరు ఎస్ఐ కరీముల్లా కొట్టడం వల్లనే తన భర్త చనిపోయాడని, నిందితులకు శిక్ష పడాలని… వ్యవస్థలకు, ప్రభుత్వానికి ఎదురు నిలబడి దళిత మహిళ చేస్తున్న పోరాటం అసామాన్యం.

దళితవర్గ పోరాటంతో… జాతీయ ఎస్సీ కమిషన్ విచారణతో రాష్ట్ర ప్రభుత్వం కదలక తప్పలేదు.పద్మ కుటుంబానికి పరిహారంతో సరిపెట్టకుండా ఆమె భర్త మృతికి కారణం అయిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. పద్మ పోరాటంలో అడుగడుగునా అండగా నిలిచిన దళిత సంఘాలకు, రాజకీయపార్టీల నేతలకు అభినందనలు. దళితుడి హత్య కేసును నీరుగార్చేందుకు చేస్తున్న సిగ్గుమాలిన ప్రయత్నాన్ని ఇకనైనా  కట్టిపెట్టాలి. ముగ్గురు బిడ్డలు అనాథలు అయిన ఘటనలో బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here