వైసీపీ నేతల స్వార్ధానికి రైతు బలి.. చంద్రబాబు ఫైర్

0
617

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రాజాఇండ్లు గ్రామానికి చెందిన రైత్నం అనే రైతు తహసీల్దార్ కార్యాయంలో ప్రాణాలు విడిచిన ఉదంతంపై టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రైతు రత్నం కబ్జాకు గురైన తన పొలం కోసం పోరాడుతూ పెనమూరు తహసీల్దారు కార్యాలయంలో ప్రాణాలు వదిలిన వార్త మనసును కలచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల స్వార్థానికి ఇంకెంతమంది సామాన్యులు బలికావాలని చంద్రబాబు ప్రశ్నించారు. న్యాయస్థానం పర్మినెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చాక కూడా ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రైతు రత్నం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాలని స్పష్టం చేశారు.

మరోవైపు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, పడమటలంకలో తెలుగుదేశం నేత చెన్నుపాటి గాంధీపై వైసీపీ రౌడీలు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న గాంధీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో తాను ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఆయన కంటికి తీవ్ర గాయం అయిందని వారు చెప్పారని.. దాడి కారణంగా గాంధీ కంటిచూపుకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్న సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి, తీవ్ర ఆవేదనకు గురైనట్లు చంద్రబాబు పేర్కొన్నారు. గాంధీకి మెరుగైన వైద్యం అందేలా చూడాలని పార్టీ నేతలకు సూచించినానని.. వినాయక మండపాల దగ్గర కూడా రక్తపాతం సృష్టించిన వైసీపీ రౌడీలపై ఏం చర్య తీసుకుంటారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని.. గాంధీపై దాడి చేసిన వైసీపీ రౌడీలను వెంటనే అరెస్టు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here