ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సీఎం వైయస్.జగన్ సమీక్ష చేపట్టారు. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎంకు వివరాలు అందించారు అధికారులు. రాష్ట్రంలో పన్నుల వసూళ్లలో పారదర్శకత, పన్నుల విభాగంలో నాణ్యమైన సేవలకు ఉద్దేశించిన పలు నిర్ణయాల అమలుపై సీఎం సమీక్ష చేశారు. పన్నుల విభాగంలో డేటా అనలిటిక్స్ సెంటర్ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు అధికారులు.
మరింత పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత పెంచి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా, ఆదాయాలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి రాబడులు ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తప్పుడు బిల్లులు లేకుండా, పన్ను ఎగవేతలకు ఆస్కారం లేకుండా మంచి విధానాలను రూపొందించుకోవాలన్న సీఎం.
– ప్రస్తుతం ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్నారు జగన్.
ఎక్సైజ్ శాఖపై సీఎం సమీక్ష చేశారు. అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలన్నారు సీఎం. బెల్టుషాపులు, గ్రామాల్లో అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులది కీలకపాత్ర అన్నారు. దీనిపై గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుకు సంబంధించి ఒక ఎస్‌ఓపీ రూపొందించాలన్నారు. అక్రమ మద్యం తయారీ, అమ్మకాలకు సంబంధించి క్రమం తప్పకుండా వారి నుంచి నివేదికలు తీసుకోవాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు అధికారులు.