మోడీని గద్దె దించాలి.. అంతా కదిలి రావాలి

0
699

పెద్దపల్లి బహిరంగ సభ లో సీఎం కేసీఆర్ బీజేపీ నేతలపై మండిపడ్డారు. పోదామా జాతీయ రాజకీయాల్లోకి అంటూ కేసీఆర్ ప్రజల్ని అడిగారు. పెద్ద పల్లి జిల్లాలో కలెక్టరేట్, టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. కలలో కూడా పెద్దపల్లి జిల్లా అవుతుంది అనుకోలేదు. తెలంగాణ స్వరాష్ట్రం రావడం తో జిల్లా గా మార్చుకోగలిగాం. దేశం ఆశ్చర్య పోయే విదంగా అనేక కార్యక్రమాలు తెలంగాణాలో చేసుకుంటున్నాం… సింగరేణి లో కార్మికులకు బోనస్ లు ఇస్తున్నాం .,పెద్దపల్లి ,మంథని పట్టణాలను మున్సిపాలిటిగా చేసుకున్నాం అన్నారు.

బీజేపీ ముక్త్ భారత్ కు అంతా కదిలిరావాలి…..మేధావులు, యువకులు మేల్కొనాలి. ప్రజల్ని చైతన్యవంతం చేయాలి.. దేశాన్ని కాపాడడానికి అంతా ముందుకు పోవాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని పారద్రోలాలి. వ్యవసాయానికి మీటర్లు పెట్టాలనే బీజేపీని ఓడించాలి.. నిన్న మొన్న 26 రాష్ట్రాల రైతు నాయకులతో మాట్లాడాను.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని వాళ్ళు కోరారు . గుజరాత్ మాడల్ అంటూ దేశం లో అధికారం లోకి వచ్చిన మోడీ అన్ని ధరలు పెంచుతున్నారు. పాలు ,పెరుగు పై కూడా GST వేసి లక్షల కోట్ల అవినీతి చేస్తున్నారు. దేశ సంపదని గద్దల్లా తింటున్నారు …

తెలంగాణ లో చేస్తున్న ఏ కార్యక్రమం దేశం లో ఏ ఇతర రాష్ట్రము లో లేదు. బూట్లు మోసే గులాములు తెలంగాణ లో కనపడుతున్నారు..ధాన్యం కొనమంటే కొనలేదు …ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ లో బియ్యం ,గోధుమ పిండికి డిమాండ్ ఉంది. తెలంగాణ లో మత విద్వేషాలు రెచ్చగుడుతున్నారు.. రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వెళ్లి రైతు ప్రభుత్వం వస్తుంది..నరేంద్ర మోదీకి మీటర్లు పెట్టాలి..చెప్పులు మోసే వెదవలు కూడా కారు కూతలు కూస్తున్నారు.. గుజరాత్ లో కల్తీ మద్యంపై ప్రధాని మోడీ స్పందించాలన్నారు సీఎం కేపీఆర్.

2024 లో బీజేపీ ముక్తు భారత్ కు సన్నద్ద పడాలి.. గుజరాత్ రోల్ మోడల్ అని చెప్పి మోసం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది..మత పిచ్చిగాళ్ళు ఉన్మాదల నుండి మనం కాపాడుకోవాలి..చెప్పులు మోయమని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు..పెద్దపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు..పేద ప్రజలను మోసం చేసి దగ్గర లక్షలు కోట్లు దోచుకున్నారు. సింగరేణి కార్మిక లోకం గళమెత్తి కన్నెర్ర జేయాలన్నారు. దేశం మొత్తం రాష్ట్ర అద్భుత ప్రగతిని చూస్తోంది.. 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నేతలు నాతో చర్చలు జరిపారు.. బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచేసింది. అన్నిటిమీద జీఎస్టీ.. పేద ప్రజల ఉసురు పోసుకుంటోంది. లక్షల రూపాయల రుణాలు ఎన్పీయేల పేరుతో రద్దుచేస్తున్నారు. తెలివితక్కువ కేంద్రం వల్ల గోధుమలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఒకసారి మోసపోతే గోసపడతాం. కూలగొట్టడం చాలా తేలిక.. కట్టడం చాలా కష్టం అన్నారు సీఎం కేసీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here