రేపు జగిత్యాలకు సీఎం కేసీఆర్.. వివరాలు ఇవే..!

0
621

జగిత్యాల జిల్లాలో రేపు సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. అయితే.. సీఎం కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా జగిత్యాలకు చేరుకుంటారు. మొదట టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం. 110 కోట్లతో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకి శంకుస్థాపన చేస్తారు సీఎం కేసీఆర్‌. నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవం ఆ తర్వాత.. జిల్లా అధికారులు, ప్రజాప్రతనిధులతో నూతన కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక బస్సు ద్వారా సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన బహిరంగ సభకు చేరుకోనున్నారు. అయితే.. ఈ సందర్భంగా మోతే గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు సీఎం కేసీఆర్. ఈ బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జగిత్యాల, చొప్పదండి వేములవాడ, కోరుట్ల ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు సీఎం కేసీఆర్‌ పయనంకానున్నారు. ఈ క్రమంలో.. సభ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షిస్తున్నారు. జగిత్యాల, ధర్మపురి సిరిసిల్ల, వేములవాడ సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, కరీంనగర్, పెద్దపల్లి, అదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్ నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నియోజకవర్గల నుండి జనసమీకరణ చేస్తున్నారు గులాబీ నేతలు. సుమారు ఐదు జిల్లాల నుండి 2 లక్షలతో భారీ బహిరంసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు.. ఎస్పీ సింధు శర్మ నేతృత్వంలో 2,325 మందితో భారీ బందోబస్తు మోహరించనున్నారు. 7 గురు అడిషనల్ ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, ముగ్గురు మహిళా సీఐలు, 165 ఎస్ఐలు, 13 మంది మహిళా ఎస్సైలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here