ఆనాడు డబ్ల్యూహెచ్‌వో నల్లగొండ గురించి హెచ్చరించింది : సీఎం కేసీఆర్‌

0
846

ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు రానున్నాయి. దీంతో.. రాష్ట్ర రాజకీయం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో నేడు మునుగోడు ప్రజా దీవెన పేరుతో టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గం ఒకనాడు ఫ్లొరైడ్‌ నీళ్లతోని, నడుములు వంగిపోయి, ఏ విధంగా బాధపడ్డదో నేను మీకు చెప్పఅవసరం లేదు. కేసీఆర్‌ కన్న ముందు.. కేసీఆర్‌ కన్నా దొడ్డుగున్నోళ్లు, కేసీఆర్‌కన్నా ఎత్తునోళ్లు ఎంతో మంది ముఖ్యమంత్రులయ్యారు. అంశాల స్వామి అనే వ్యక్తిని తీసుకువెళ్లి.. ఆనాడు ఇదే జిల్లా బిడ్డ దుచ్చర్ల సత్యనారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసి జలసాధన కోసంపోరాటం చేసి.. ఆనాడు ఉన్నటువంటి ప్రధానిమంత్రి టేబుల్‌ మీద మా బతుకు ఇది అని అంటే.. ఎవ్వరూ కూడా మన మొర వినలే. ఆ తరువాత నేనే వచ్చి తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తరువాత రాష్ట్రామంతా మీ బాధ చెప్పుతూ వచ్చాను. దేశంతో పాటు విదేశాల నుంచి ఎంతో మంది వచ్చి బాధవ్యక్తం చేశారు. అయితే.. సమస్య పరిష్కారం చేయండని వారికి చెప్పాం. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నల్లగొండ నగారా అనే పేరుతో 15 రోజుల పాటు నేను సైతం జిల్లా తిరిగి ఫ్లొరైడ్‌ బాధలపై చైతన్యం పరచడం జరిగింది. శివన్నగూడెం గ్రామంలో నేను నిద్రకూడా చేయడం జరిగింది.

‘ఏమాయానే.. నల్లగొండ’ అనే మాటకూడా చెప్పడం జరిగింది. ఈ రోజు అనేక ప్రభుత్వాలు, పార్టీలు, రాజకీయాల తరువాత.. మనందరి పోరాట ఫలితంగా మన తెలంగాణ మనకు వస్తే.. ఇవాళ్ల జీరో ఫ్లొరైడ్‌.. ఫ్లొరైడ్‌ రహిత మునుగోడుగా.. ఫ్లొరైడ్‌ రహిత నల్లగొండగా మనం మార్చుకున్నం. మిషన్‌ భగీరథతోని ఆ సత్యం మీముందే ఉందని నేను మనవి చేస్తున్నా. ఒక సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. నల్లగొండ జిల్లాలో సరైన ప్రయత్నాలు జరుగకుంటే.. మానవ నివాస యోగం కాకుండా పోతది. ఇక్కడ మనుషులు నివసించలేరు. ఇక్కడ మంచినీళ్లు పైపుల ద్వారా ఇవ్వాలే.. శుద్ధి చేసిన నీళ్లు ఇవ్వాలే.. పొలాలకు కూడా పండించే పంటలకు ఫ్లొరైడ్‌ ఎక్కుతా ఉన్నది. కల్లు ఇచ్చే తాటి చెట్లకు కూడా ఫ్లొరైడ్‌ ఎక్కుతా ఉన్నది. ఇక్కడ పండించే పంటలు తింటే కూడా ప్రమాదానికి దారితీస్తదని డబ్ల్యూహెచ్‌వో చెప్పితేకూడా ఆనాడు రాష్ట్ర పాలకులు, కేంద్ర పాలకులు పట్టించుకోలే అని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here