ఆ ఆడియోల ఎఫెక్ట్‌..! అవంతి పదవికి ఎసరు తెచ్చాయిగా..

0
914

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. వైసీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో పాటు.. పార్టీ జిల్లా అధ్యక్షుల్లోనూ మార్పులు చేర్పులు చేశారు పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, ఈ సమయంలో.. మాజీమంత్రి అవంతి శ్రీనివాస్‌కు హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. విశాఖ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి అనూహ్యంగా తొలగించింది. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు అవకాశం కల్పించింది. గత ఎన్నికల ముందు.. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిన అవంతి.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తొలి కేబినెట్‌లో టూరిజం మంత్రిగా పనిచేశారు. అయితే, కేబినెట్‌ విస్తరణలో పదవి పోయిన తర్వాత అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది హైకమాండ్.. కానీ, ఇప్పుడు ఆ పదవి నుంచి కూడా తప్పించింది. అయితే, అవంతికి ఆ పరిస్థితి రావడానికి ఆయనే కారణమట..

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కి పార్టీ నాయకత్వంతో విభేదాలు, సమన్వయం కొరవడడంతో ఆయనపై క్రమంగా వ్యతిరేకత పెరుగుతూ వచ్చిందట.. అదే సమయంలో ఆయన వ్యక్తిగత వ్యవహారాలు దుమారం రేపాయి. మహిళలతో సంభాషణలు ఆడియోలు లీక్ అవ్వడం, అవి తన వాయిస్‌లు కాదంటూ అవంతి వివరణ ఇచ్చుకోవడం జరుగుతోంది. కానీ, ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్టాతకు ఇబ్బందికరంగానే మారిందట.. ఈ నేపథ్యంలో అవంతిని మార్చి అదే సామాజిక వర్గానికి చెందిన పంచకర్లకు అవకాశం కల్పించారు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఏపీ సీఎం.. ఓవైపు రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకంలో మార్పులు చేర్పులు చేయడంతో పాటు.. మరోవైపు.. పార్టీ జిల్లా అధ్యక్షుల్లోనూ కొన్ని మార్పులు చేర్పులు చేశారు.. మొత్తగా అవంతి శ్రీనివాస్‌ మాత్రం.. తన గోయి తానే తొవ్వుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here