కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై దాడి.. అర్ధరాత్రి 15 కిలోమీటర్లు పరిగెత్తి తప్పించుకున్న ఎమ్మెల్యే

0
463

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తుది దశ పోలింగ్‌ జరుగుతోన్న వేళ.. సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంతి ఖరాడీ.. బనస్కాంత జిల్లా దంతా ఎస్టీ రిజర్వుడు స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే… తనపై బీజేపీ అభ్యర్థి లాధు పర్ఘీ, అతడి అనుచరులు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు గుప్పించారు.. వారి నుంచి తన ప్రాణాలు కాపాడుకోడానికి 15 కిలోమీటర్లు పరిగెత్తాల్సి వచ్చిందని పేర్కొన్నారు.. అయితే, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిగ్నేష్ మేవానీ.. అదృశ్యమైన పార్టీ అభ్యర్థి గురించి సోషల్ మీడియాలో సమాచారాన్ని పంచుకున్నారు. “కాంగ్రెస్ అభ్యర్థి కాంతిభాయ్ ఖరాడిపై బీజేపీ అభ్యర్థి మరియు పార్టీ గూండాలు దాడి చేశారు, ఎన్నికల సమయంలో వివిధ గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తలను కలిసి తిరిగి వస్తుండగా, అతని కారును అడ్డగించి దాడి చేశారు, అతనిని చంపడానికి ప్రయత్నించారని.. కాంతిభాయ్ ఇప్పటికీ కనిపించలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ మేవానీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక, కాంతి ఖరాడిపై దాడి జరిగినట్లు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందిందని బనస్కథ జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్‌ఛార్జ్ ధృవీకరించారు. ఈ ఘటన హదాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్‌సింగ్ వాఘేలా ఖారాడీకి చేరుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు. “నేను మాట్లాడటానికి మరియు పోలీసు సూపరింటెండెంట్ జోక్యాన్ని కోరడానికి ప్రయత్నించినప్పటికీ, అతను నా కాల్‌కు స్పందించలేదని విమర్శించారు.. అయితే, ఇదంతా జరిగిన తర్వాత.. తనపై జరిగిన దాడిని బయటపెట్టారు ఎమ్మెల్యే కాంతి ఖరాడీ.. నా నియోజకవర్గంలోని ఓటర్లను కలవడానికి వెళ్తుండగా బీజేపీ అభ్యర్థి లాధు పర్ఘీ, మరి కొందరు నేతలు నాపై దాడి చేశాడు.. ఆయుధాలతో వచ్చినవాళ్లు నాపై కత్తులతో ఎగబడ్డారు.. మా వాహనాలు బమోదర నాలుగు లైన్ రహదారిపై వెళ్తుండగా బీజేపీ అభ్యర్థి మా దారికి అడ్డుగా వచ్చాడు.. ఆ తర్వాత మేము తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాం.. అప్పుడు ఎక్కువ మంది వచ్చి మాపై దాడి చేశారు.. అక్కడ నుంచి మేం వెన్కి వస్తుండగా కొన్ని కార్లు మమ్మల్ని వెంబడించాయి.. బీజేపీ అభ్యర్థి లాతు పర్ఘీ, మరో ఇద్దరు ఆయుధాలు, కత్తులతో వచ్చారు.. మేం తప్పించుకుని 10-15 కిలోమీటర్లు పరిగెత్తామని.. దాదాపు 2 గంటలు అడవిలోనే ఉన్నామని.. రాత్రి చీకట్లో దాదాపు 15 కిలోమీటర్లు పరిగెత్తుతూ బీజేపీ గూండాల దాడి నుంచి తన ప్రాణాలను కాపాడుకున్నానని వెల్లడించారు ఎమ్మెల్యే కాంతి ఖరాడీ.. తుది దశ పోలింగ్‌ జరుగుతోన్న సమయంలో బయటపకు వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here