సత్తుపల్లి సింగరేణి భాదితుల కోసం అమరణ నిరహర దీక్ష చేస్తున్న టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతరాయ్ స్థానిక ఎమ్మెల్యే సండ్ర పై ఫైర్ అయ్యారు. మానవత రాయ్ మాట్లాడుతూ.. సింగరేణి ప్రభావంతో నష్టపోతున్న కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆమరణ దీక్ష చేపట్టామన్నారు. అంతేకాకుండా.. న్యాయం చేయాల్సిన ఎమ్మెల్యే, పోలీస్ లతో కలిసి దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర చేస్తున్నారు మానవత రాయ్ మండిపడ్డారు. నిరహర దీక్ష కోసం టెంట్ వేస్తే భగ్నం చేసేందుకు టెంట్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళారని ఆయన ఆరోపించారు. మండుటేండలో సైతం దీక్ష కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. సింగరేణి నిధుల దుర్వినియోగం అధికారులే చేశారని స్థానిక ఎమ్మెల్యే సండ్ర చెప్పటం విడ్డూరమన్నారు.
ఎమ్మెల్యే సండ్రకు తెలియకుండా నిధులు పక్కదోవ పట్టాయా అని ఆయన వ్యాఖ్యానించారు. సింగరేణి నిధులకు సంబంధించిన విషయాలను తమకు తెలిపాడు అని సింగరేణి జీఎంను రాత్రికి రాత్రే బదిలీ చేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కు డబ్బు మదం పట్టిందని, అధికారానికి ప్రతిపక్షానికి తేడా తెలియటం లేదని ఆయన విమర్శించారు. వట్టిచేతులతో వచ్చిన ఎమ్మెల్యే సండ్ర కోట్ల రూపాయలను పోగేశారని, సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం తమతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు ఎమ్మెల్యే కు దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. అధికార పార్టీలో ఉండి నిరహర దీక్ష చేస్తా అనటం సిగ్గు చేటు అంటూ ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు మానవత రాయ్.