ఆత్మగౌరవం ఉన్న ఏ పార్టీ కూడా బీజేపీతో కలవదు.బీజేపీకి ఊడిగం చేయననే స్థాయిలో పవన్ కామెంట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..?బీజేపీ పాచిపోయిన లడ్డూలిచ్చిందన్న పవన్.. ఇప్పటికీ పాచిపోయిన లడ్డూలతోనే అంటకాగుతున్నారు.ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా పవన్ బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలి.బీజేపీ నాయకత్వంలోనే అంతర్గతంగా గొడవ జరుగుతోంది.ప్రాంతీయ పార్టీలను కబళిస్తోన్న బీజేపీ విషయంలో ఎలా వ్యవహరించాలో టీడీపీ కూడా ఆలోచించుకోవాలి.ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న భూ దోపిడీ గతంలో ఎన్నడూ జరగలేదన్నారు శ్రీనివాస్.
రాష్ట్ర వ్యాప్తంగా 5-6 లక్షల ఎకరాల మేర భూమి కబ్జాలకు గురైంది.ప్రతి నియోజకవర్గంలో మార్క్ చేసుకుని మరీ కబ్జాలు చేస్తున్నారు.భూపోరాటాలు చేస్తోన్న పేదలపై కేసులు పెడుతున్నారు.కబ్జాలు కంచెలు వేస్తున్న వారిని.. అసైన్డ్ భూములను రిజిస్టర్ చేయించుకున్న వారిని మహరాజ పోషకుల్లా చూస్తున్నారు.అసైన్డ్ భూములను పేదల నుంచి అడ్డగోలుగా లాక్కొంటున్నారు.ప్రతి ఊళ్లో సెక్షన్-144, సెక్షన్-30 అంటున్నారు.మత్మోనాదులైన బీజేపీ, ఆరెస్సెస్ వాళ్లని ప్రభుత్వం అల్లుళ్లుగా చూస్తోంది.బీజేపీ విషయంలో వైసీపీ ప్రభుత్వం చాలా సాఫ్ట్ కార్నరుతో ఉందని ఆరోపించారు.