వర్షాలతో జాగ్రత్త.. ప్రాణనష్టం జరగకుండా చూడండి

0
866

మరికొద్దిరోజుల వరుణుడి ప్రతాపం తెలంగాణపై కనిపించనుంది. రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న భారీ వానలు వరదల నేపథ్యంలో… ఇంకా భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో .. ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ తో కలసి ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రానున్న రెండు రోజుల్లోభారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున జిల్లాకలెక్టర్లు అప్రమత్తతతో ఉండాలని ఆదేశించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం ఏర్పడకుండా చర్యలు చేపట్టాలి. వరుసగా రెండు రోజులు సెలవు రోజులు వస్తున్నందున, సెలవులను ఉపయోగించకుండా పునరావాస కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున వరదలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండినందున చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు చేపట్టాలి.

ఎక్కడైతే రహదారులు, బ్రిడ్జిలు ఎక్కడ తెగిపోయాయో, ఆయామార్గాల్లో ప్రమాదాలు జరగకుండా వాహనాలను, ప్రయాణకులను నిలిపి వేయాలి. పోలీసు, నీటి పారుదల, రోడ్లు భవనాలు, విధ్యుత్, రెవిన్యూ తదితర శాఖలన్నీ మరింత సమన్వయంతో పనిచేయాలన్నారు సీఎస్ సోమేష్ కుమార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here