ఘాటెక్కుతోన్న మిర్చి.. క్వింటాల్ ధర 90 వేలు..

0
505

మొన్నటి వరకు రూ.40 వేలు కూడా పలకని క్వింటాల్‌ మిర్చి ధర.. ఇప్పుడు ఏకంగా లక్షకు చేరువైంది… వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డులు సృష్టించింది మిర్చి ధర.. దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 90 వేలు పలికింది… మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు కావడం విశేషం.. హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబత్ పల్లికి చెందిన అశోక్ అనే రైతు మార్కెట్‌కు మిర్చి తీసుకొచ్చారు.. రైతు తీసుకొచ్చిన మిర్చిని మాదవి ట్రేడర్స్ విక్రయించగా… క్వింటాల్‌కు రూ.90 వేలు వెచ్చించి కోనుగోలు చేసింది లక్ష్మీ సాయి ట్రేడర్స్‌… అశోక్‌ తీసుకొచ్చిన మిర్చిలో ఒక్క బస్తాకు మాత్రమే ఈ అత్యధిక ధర పలికింది. మిగతా బస్తాలకు సాధారణ రేట్లే వచ్చాయి.. మొత్తంగా.. మిర్చి ధర పైకికి ఎగబాకడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారుఉ.. ఇక, తన మిర్చికి మంచి ధర లభించడంపై రైతు అశోక్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

అయితే, జూలైలో వండర్ హాట్ రకం మిర్చి క్వింటాల్‌కు అత్యధికంగా రూ. 32,500కు అమ్ముడుపోగా.. సెప్టెంబర్ నెలలో అత్యధికంగా రూ. 35,500కు విక్రయించారు.. . ఇప్పుడు దేశీ మిర్చి 90 వేలకు చేరుకుని అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అకాల వర్షాలతో పాటు తెగుళ్లతో ఇబ్బంది పడిన మిర్చి రైతులకు మార్కెట్ లో మంచి ధర లభిస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి వస్తుందో రాదో అనే భయంతో ఉన్న రైతులకు ఈ రికార్డు ధర కొత్త ఊరటనిస్తోంది. ఇన్ని రోజులుగా విక్రయించేందుకు ఎదురుచూస్తున్న మిర్చి రైతులు మార్కెట్‌కు క్యూ కడుతున్నారు.. మొత్తంగా.. ధర పెరడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here