డీజీపీ మహేందర్‌రెడ్డి పొలిటికల్‌ ఎంట్రీ..! ఏ పోస్ట్‌ ఇస్తారో మరి..?

0
844

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు కొత్త చర్చ సాగుతోంది… ప్రస్తుతం డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి.. త్వరలోనే రిటైర్డ్‌ కానున్నారు.. ఆ తర్వాత ఆయన పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తారా? ఇస్తే.. ఎలాంటి పాత్ర పోషించనున్నారు. ఏ పోస్ట్‌ దక్కే అవకాశం ఉంది? అనే చర్చ పొలిటికల్‌ సర్కిల్‌లో సాగుతోంది.. అయితే, వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు డీజీపీ మహేందర్‌రెడ్డి.. ఈ నేపథ్యంలోనే ఈ చర్చ తెరపైకి వచ్చింది.. అసలు డీజీపీ మహేందర్‌రెడ్డికి.. రాజకీయాలకు ఏంటి సంబంధం అనే అనుమానం రావొచ్చు.. దాని వెనుక ఉన్నది మాత్రం టీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అనే చెప్పాలి.. ఎందుకంటే..? ఆగస్టులో హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు కేసీఆర్‌.. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి రిటైర్మెంట్ గురించి ప్రస్తావించిన ఆయన.. రిటైర్మెంట్ తరవాత కూడా మహేందర్ రెడ్డి సేవలను ఉపయోగించుకుంటామని వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు బాటలు వేసింది.

వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న మహేందర్‌రెడ్డి సేవలను.. ప్రభుత్వ సలహాదారుగా కేసీఆర్‌ ఉపయోగించుకుంటారా? లేదా పార్టీ కండువా కప్పేసి.. ఏదైనా పోస్ట్‌ ఇస్తారా? లేదా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దింపుతారా? అనే చర్చ సాగుతోంది. కాగా, ఇటీవలే సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో మహేందర్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తారా లేదా మరో నామినేటెడ్‌ పోస్టులో నియమిస్తారా అన్న చర్చ మొదలైంది. మరి మహేందర్‌రెడ్డి పదవీ విరమణ తర్వాత ఎలాంటి రోల్‌ పోషించనున్నారు..? నిజంగా కేసీఆర్‌ ఆయన్ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారా? మరో రకంగా ఆయన సేవలు వినియోగించుకుంటారా? అసలు కేసీఆర్‌ మదిలో ఏముంది.. మహేందర్‌రెడ్డి ఏమనుకుంటున్నారు? అనే విషయాలపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా.. ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా విధులు నిర్వహించి.. మధ్యలోనే రాజీనామా చేసి పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన ఆఫీసర్లు, పదవీ విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లో రాణించిన నేతలు కూడా లేకపోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here