అన్నవరం సత్యదేవుడికి వజ్రకిరీటం బహుమతి

0
1147

భక్తులతో నిత్యం రద్దీగా వుండే రత్నగిరీశుడికి మరింత కాంతి రానుంది. అన్నవరం సత్యదేవునికి కాకినాడ జిల్లా పెద్దాపురం ప్రాంతానికి చెందిన మట్టే సత్య ప్రసాద్ అనే భక్తుడు సుమారు ఒకటిన్నర కోటి రూపాయల వ్యయంతో వజ్ర కిరీటాన్ని తయారు చేయంచారు. 682.230 గ్రాముల బంగారం,114.41 క్యారెట్ల వజ్రాలు,14.97 క్యారెట్ల కెంపు పచ్చ తో చేసిన వజ్ర కిరీటాన్ని స్వామివారికి కానుకగా ఇవ్వనున్నారు. ఈ వజ్ర కిరీటాన్ని స్వామి జయంతి సందర్భంగా రేపు అలంకరణ చేస్తామని అధికారులు తెలిపారు.

పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి కొండ మీద వెలసిన సత్య దేవుని ఆలయం మహిమాన్వితం. ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తున ఉంది. అన్నవరం ఆలయ ప్రాంగణంలో సత్యదేవునితో పాటు శ్రీ సీతారాముల వారి గుడి, వన దుర్గమ్మ గుడి, కనక దుర్గమ్మ గుడి వంటి ఆలయాలు కూడా ఉన్నాయి. కొండ కింద గ్రామ దేవత గుడితో మొదలయ్యే దర్శనం చివరగా సత్యదేవునితో ముగుస్తుంది. తూర్పు గోదావరి జిల్లా కు చెందిన అన్నవరం, రాజమండ్రి కి 70 కి. మీ. దూరంలో మరియు కాకినాడ కి 45 కి. మీ. దూరంలో ఉంది.

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున వనదుర్గ ఆలయం, రామాలయం, విశ్రాంతి మందిరం కనిపిస్తూ ఉంటాయి. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పెళ్ళిళ్లు జరుగుతాయి. రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాల ఉన్నాయి. కొత్తగా పెళ్లయిన జంటలు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. దీంతో గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి. స్వామి వారికి నిత్యం పూజలు, ఆర్చనలు మరియు భక్తుల సామూహిక వ్రతాలు జరుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here