బంజారాహిల్స్ స్టూడెంట్ కేసులో సంచలన అంశాలు

0
904

ఎన్నిచట్టాలు వచ్చినా కీచకుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఓ ప్రైవేట్ స్కూళ్ళో డ్రైవర్ ముక్కుపచ్చలారని చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆ కీచక డ్రైవర్ పనిపట్టారు. బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూళ్ళో ఈ ఘటన జరిగింది. దీంతో ఆ కీచక డ్రైవర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు.. కీచక డ్రైవర్ రజనీ కుమార్‌ను అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు అతని ఫోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. ఎల్‌కేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు డ్రైవర్ రజనీకుమార్.

మైనర్ బాలిక లైంగిక దాడి కేసుకి సంబంధించి FIR లో కీలక అంశాలు బయటపడుతున్నాయి. మైనర్ బాలిక పై లైంగిక దాడి జరిగిందని నిన్న మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు చిన్నారి తల్లిదండ్రులు.. 5 నెలల క్రితం చిన్నారి రోడ్ నంబర్ 14 లో BS DAV స్కూల్ లో చేర్పించారు చిన్నారి తల్లిదండ్రులు.. కాళ్ల నొప్పులు, భయంగా ఉండటాన్ని గమనించిన చిన్నారి తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరాతీశారు. నిన్న చిన్నారి ని అడిగి అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ కి వెళ్లారు. స్కూల్ లోని డ్రైవర్ రజినికుమార్ పేరు తల్లిదండ్రులకు చెప్పింది చిన్నారి.

3 నెలల నుండి చిన్నారి పై లైంగికదాడికి పాల్పడ్డాడు డ్రైవర్ రజినికుమార్. క్లాస్ రూంలో ఉన్న చిన్నారిని చీకటిగా ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్లిన డ్రైవర్ రజిని కుమార్. ఎవరు లేని రూమ్ లోకి చిన్నారిని తీసుకెళ్లి చిన్నారిని చిత్రహింసలు గురి చేసిన డ్రైవర్ రజినికుమార్. విషయం తెలిసి చిన్నారిని స్కూల్ కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. స్కూల్ లోకి వెళ్లినవెంటనే డ్రైవర్ ను తల్లిదండ్రులకు చూపించింది చిన్నారి. అతడిని ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ గా గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిన్నారి తల్లిదండ్రులు. మరోవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు చిన్నారి తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here