తాగి ఫోన్‌ నంబర్‌ అడిగాడు.. చావు దెబ్బలు తిన్నాడు..

0
506

ఒక్కోడు ఒక్కో రకంగా అన్నట్టుడా.. మహిళలపై వేధింపులకు పాల్పడుతోన్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఓ వ్యక్తి మద్యం సేవించి.. తన దారిలో తను వెళ్లకుండా.. ఓ మహిళలను వేధించడంతో చెప్పుదెబ్బలు తప్పలేదు.. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు.. ధార్వాడ్ జిల్లాలో ఫుల్‌గా మద్యం సేవించిన వ్యక్తి.. శుభాష్‌ రోడ్డులో తూలుతూ కనిపించాడు. అక్కడ ఉన్న ఓ మహిళ వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు.. అంతటితో ఆగకుండా.. ఆమె ఫోన్‌ నంబర్‌ అడిగాడు. దీంతో, ఆ మహిళకు చిర్రెత్తుకొచ్చింది.. ఆ వ్యక్తిని నడిరోడ్డుపై శిక్ష విధించింది.. చెప్పుతో కొట్టింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలు సైతం మహిళకు సపోర్ట్‌గా నిలవడంతో.. మందు బాబుకు చెప్పు దెబ్బలు తప్పలేదు.. ఇక, ఈ వ్యవహారాన్ని మొత్తం వీడియో చిత్రీకరించిన ఓ వ్యక్తి.. దానిని సోషల్‌ మీడియాకు ఎక్కించడంతో అది కాస్తా వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియోలో రోడ్డుపై కూర్చున్న వ్యక్తి తలపై, ముఖంపై చెప్పుతో వీర బాధుడు బాదుతోంది సదరు మహిళ.. మరో యువకుడు కూడా ఆ వ్యక్తిని కాలుతో తన్నుతూ.. పిడిగుద్దులు గుద్దుతూ కనిపిస్తున్నాడు.. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్‌గా మారిపోగా.. కొందరు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here