ఏపీలో మరో ఎలక్ట్రిక్‌ బైక్‌లో మంటలు.. స్థానికుల పరుగులు..

0
733

వరుసగా పెరిగిపోతున్న పెట్రో ధరలతో ప్రత్యామ్నాయ వాహనాలపై దృష్టి సారించారు ప్రజలు.. సిటీలు, పట్టణాలు అనే తేడా లేకుండా.. ఎలక్ట్రిక్‌ వాహనాలు కనిపిస్తున్నాయి… బైక్‌లతో పాటు కార్లు, ఆటోలు ఇలా చాలా రకాల వెహికల్స్‌ రోడ్లపై తిరుగుతు్నాయి.. అయితే, ఇదే సమయంలో వరుస ప్రమాదాలు కూడా కలవర పెడుతున్నాయి.. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాటరీ వాహనాలు చార్జింగ్‌ పెట్టిన సమయంలో.. ప్రయాణ సమయంలో ఒక్కసారిగా పొగలు, మంటలు చెలరేగి ప్రమాదాలు జరిగిన ఘటలు ఎన్నో ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఘటన వెలుగు చూశాయి.. తాజాగా, ఏపీలో మరో ఘటన చోటు చేసుకుంది…

కాకినాడ జిల్లా సామర్లకోట స్టేషన్ సెంటర్‌లో రోడ్డుపై నిలిపి ఉన్న బ్యాటరీ బైక్‌ షార్ట్ సర్క్యూట్ కారణంగా.. మొదట పొగలు వచ్చి.. ఆ తర్వాత మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయ్యింది.. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ఈ సెంటర్ లో బైక్ తగులబడిపోతుండడంతో పలువురు పరుగులు పెట్టారు.. వాహన యజమాని పాన్ షాపు వద్దకు వచ్చినపుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఈ మంటల్లో చిక్కుకున్న బాటరీ బైక్ సుమారు రూ. లక్షా పది వేలు విలువ కలిగి ఉంటుందని బైక్ యజమాని వాపోయారు. ఇటీవల కాలంలో పలు పట్టణాలలో బ్యాటరీ బైకల్‌లు దగ్ధం అవుతున్నట్లు వార్తలు వస్తూనే ఉండగా.. ఇప్పుడు సామర్లకోటలో ఎలక్ట్రిక్‌ బైక్‌ దగ్ధం కావడం కలకలం సృష్టిస్తోంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here