కిరణ్ కుమార్ రెడ్డి రూటెటు? బీజేపీలో చేరతారా?

0
134

రాబోయే ఎన్నికల నాటికి బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది. మంచి గ్లామర్ ఉన్న నాయకుడు బీజేపీకి కరువైన వేళ.. ఆపరేషన్ ఆకర్ష్ వైపు బీజేపీ హైకమాండ్ అడుగులు వేస్తోంది. త్వరలో బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా రాజకీయంగా అంతగా యాక్టివ్ గా లేరు కిరణ్ కుమార్ రెడ్డి, తాజాగా బీజేపీ జాతీయ నాయకత్వంతో టచ్ లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కీలక పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతోన్న క్రమంలో ఏపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది.

ఏపీ బీజేపీలో ఇమేజ్ ఉన్న లీడర్ లేకపోవడంతో కిరణ్ ను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోన్న బీజేపీ ఆదిశగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. జాతీయ స్థాయిలో పదవి కట్టబెడతామని కిరణ్ కు బీజేపీ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చెయనున్నారు. రాహుల్ గాంధీ ఇటీవల ఏపీ కాంగ్రెస్ పై ఫోకస్ పెంచాలని భావించారు. కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని భావించారు. అయితే, కాంగ్రెస్ లో ఉండేందుకు కిరణ్ కుమార్ రెడ్డి అంత ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి స్తబ్ధుగా ఉన్నారు. ఇటీవల బీజేపీలో కీలక పాత్ర పోషించిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ బీజేపీలో బలమయిన నేత లేరు.

రాబోయే ఎన్నికల నాటికి ఏపీ బీజేపీని బాగా పటిష్టం చేయాలని అమిత్ షా భావిస్తున్నారు. అందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కి డోర్లు తెరిచారు. కిరణ్ కుమార్ రెడ్డి ని ఆకర్షించి, మంచి పదవి ఇవ్వాలని భావించారు. అందులో భాగంగానే బీజేపీ అగ్రనేతల సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. అంతకు ముందు మీడియాతోనూ మాట్లాడే ఛాన్స్‌ ఉంది. ఏపీ విభజనకు ముందు కిరణ్ సీఎంగా వ్యవహరించారు. చివరి బాల్ వరకూ ఆట ఆడదామని, తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదన్నారు. విభజన అనివార్కం కావడంతో అప్పట్లో సీఎం పోస్ట్‌కి, కాంగ్రెస్‌ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన కిరణ్‌కుమార్‌.. 2014లో ఘోరపరాజయం తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరినా పార్టీ వ్యవహారాలకు అంటీముట్టనట్లుగానే ఉన్నారు. కొన్నేళ్లుగా పూర్తి రాజకీయ అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఇకపై బీజేపీలోకి వెళ్లి జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మరి, నల్లారి వారి సేవలను బీజేపీ నేతలు ఎలా వాడుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here