బడ్జెట్ లో కొత్తదనం ఎక్కడ? .. అప్పుల గురించి చెప్పరా?

0
106

ఆర్థికమంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. వైసీపీ ప్రభుత్వం డీబీటీల విషయంలో చెప్పేదొకటి.. చేసేదొకటి.గతేడా డీబీటీ స్కీంల కోసం జరిపిన కేటాయింపుల కంటే రూ. 2 వేల కోట్ల మేర తక్కువగా ఖర్చు పెట్టారు.సంక్షేమ పథకాల్లో కోత విధించడం వల్లే కేటాయింపుల కంటే తక్కువ ఖర్చు పెట్టారని అర్తమవుతోంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో డీబీటీల నిమిత్తం రూ. 54 వేల కోట్లు కేటాయించారు.

సంక్షేమానికి ఈ ప్రభుత్వం కేవలం 17 శాతం మాత్రమే కేటాయిస్తోంది.రాష్ట్రంలో అర్హులైన లబ్దిదారులు 60 శాతం మేర ఉంటే అరకొర కేటాయింపులు ఏ మాత్రం సరిపోతుంది..?విద్య, వైద్యం వంటి రంగాలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదు.ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం లేదు.ఫీజు రీ-ఇంబర్సుమెంట్ లోపభూయిష్టంగా ఉండడంతో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి.. డ్రాపవుట్స్ పెరుగుతున్నాయి.దీని వల్ల విద్య, వైద్య సేవలు అందక పేదలు ఇబ్బంది పడడుతున్నారు.వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్టులో కొత్తదనం లేదు.ఇప్పటి వరకు వైసీపీ నాలుగు బడ్జెట్టులు ప్రవేశ పెట్టినా ఎలాంటి అభివృద్ధి చూపడం లేదు.

పెట్టుబడి వ్యయం 10-15 శాతం మేరే ఖర్చు పెడుతున్నారు.మౌళిక వసతుల కల్పనకు నిధుల్లేవ్.గతేడాది పెట్టుబడి వ్యయం రూ. 33 వేల కోట్లు కేటాయిస్తే.. ఖర్చు చేసింది మాత్రం కేవలం రూ. 16 వేల కోట్లుగా చూపుతున్నారు.కానీ పెట్టుబడి వ్యయం నిమిత్తం ఖర్చు పెట్టింది వాస్తవానికి రూ. 7 వేల కోట్లు మాత్రమేనని సమాచారం. నాలుగు బడ్జెట్టులు చూశాక ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందనే నమ్మకాన్ని కలిగించ లేకపోయిందని విమర్శించారు యనమల. తెచ్చిన అప్పుడెక్కడికి వెళ్లింది.అప్పుల ద్వారా వచ్చిన నిధులను ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు.అప్పుల విషయాన్ని బడ్జెట్టులోనో.. బడ్జెట్ స్పీచులోనే చెప్పకుంటే ఎలా..?అన్ని రూపాలుగా చేసిన అప్పులెంత..? వాటికి కడుతోన్న వడ్డీలెంత..?రాష్ట్రాన్ని కోలుకోలేని ఆర్ధిక పరిస్థితుల్లోకి నెట్టారు.వచ్చే ఎన్నికల్లో జరిగేది సివిల్ వార్.2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 11 లక్షల కోట్ల మేరకు అప్పులు చేరతాయి.

కార్పోరేట్ బారోయింగ్స్ లెక్కలు బడ్జెట్టులో ఎందుకు చూపడం లేదు..?జీఎస్డీపీ గ్రోత్ పెరగకుంటే రెవెన్యూ జనరేషన్ జరగదు. అప్పులను ఉత్పాదక రంగాల్లో పెట్టాలి.. కానీ దాన్ని ఆ రంగాలకు కాకుండా వేరే రంగాలకు మళ్లించారు.ఎఫ్ఆర్బీఎం, బడ్జెట్ నింబధనల ఉల్లంఘన యధేచ్ఛగా జరుగుతోంది.బడ్జెట్ మాన్యువల్ ప్రకారం సంప్లిమెంటరీ గ్రాంట్స్ 10 శాతం మేర పెంచకూడదు.కానీ ఇష్టానుసారంగా అసెంబ్లీ ఆమోదం పొందకుండానే అధిక ఖర్చులు చేస్తున్నారు. టీడీపీ హయాంలో రెవెన్యూ డెఫిసిట్ తగ్గిస్తే.. ఈ ప్రభుత్వం పెంచేస్తోంది.రెవెన్యూ డెఫిసిట్ తగ్గకుంటే ప్రజలపై భారం పడుతుంది.ఓపెన్ మార్కెట్టులో ఎక్కువ వడ్డీలకు అప్పులు తెస్తున్నారు.ఓడీ, వేస్ అండ్ మీన్స్ లేని రోజంటూ లేదన్నారు యనమల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here