తెలంగాణ కాంగ్రెస్‌లో మరో వికెట్‌..! కీలక నేత జంప్..?

0
725

తెలంగాణ కాంగ్రెస్‌ను వరుస రాజీనామాలను కుదిపేస్తున్నాయి.. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇష్యూ హాట్ టాపిక్‌గా సాగుతోన్న సమయంలోనే.. పార్టీలో కీలక నేతగా ఉన్న దాసోజు శ్రవణ్‌ కుమార్‌.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇక, 21వ తేదీన అధికారికంగా బీజేపీలో చేరనున్నారు రాజగోపాల్‌రెడ్డి.. అయితే, మరో నేత రాజీనామా చేస్తానంటూ హెచ్చరించారట… ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా ఉన్న మహేశ్వర్ రెడ్డి.. తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. పార్టీ నేతల తీరు, ముఖ్యంగా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ ఠాగూర్‌ వ్యవహారశైలిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాల సమాచారం డీసీసీల నుండి కనీసం రావడం లేదంటున్నారు.. దీంతో, రాజీనామా చేస్తానని బెదిరించారట.

అయితే, ఈ వ్యవహారాలపై మహేశ్వర్ రెడ్డిని ప్రశ్నించగా.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.. ప్రస్తుతం రివ్యూ మీటింగ్ కోసం గాంధీ భవన్‌కు వచ్చాను.. నేను కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటానని తెలిపారు. ఇక, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ ఠాగూర్‌తో ఉన్న విభేదాలను క్లోజ్‌ డోర్‌లో చర్చ చేస్తామన్న ఆయన.. అసంతృప్తి, పార్టీలో సమస్యలు ఉంటే చర్చిస్తాం అన్నారు. తనకు అప్పగించిన ఏఐసీసీ కార్యక్రమాలు ఖచ్చితంగా నెరవేర్చాను.. నా మీద ఎలాంటి మచ్చ లేదు అంటున్నారు మహేశ్వర్‌రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here