కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు …రైతుల సంబరాలు

0
951

మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ.. రైతులు చేసిన పోరాటం ఫలించింది. రైతుల ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చింది. మాస్టర్ ప్లాన్ ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. డ్రాప్ట్ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు తీర్మాణించింది. మున్సిపల్ కౌన్సిల్ తీర్మాణంతో రైతులు సంబరాలు జరుపుకునన్నారు. రైతులు సాధించిన విజయంగా అభివర్ణిస్తూ.. మాస్టర్ ప్లా్న్ ఆందోళనలను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ పక్రియ నిలిచిపోయింది. ఈ మేరకు ప్లాన్ నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో.. అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన అర్వింద్ కుమార్ .. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై చర్చించారు. విలీన గ్రామ ప్రజల అభిప్రాయాలను తీసుకుని.. నూతన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని వెల్లడించారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో ఈ పక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు.. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో.. ఛైర్మన్ నిట్టు జాహ్నవి అధ్యక్షతన పాలకవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మాస్టర్ ప్లా్న్ ముసాయిదాను రద్దు చేస్తున్నట్లు ఏకవాఖ్య తీర్మాణం చేశారు.

మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మాణం .. ఛైర్ పర్సన్ జాహ్నావి ప్రవేశపెట్టగా.. బి.ఆర్.ఎస్. ప్లోర్ లీడర్ మీర్జా బీజేపీ ప్లోర్ లీడర్ శ్రీకాంత్, కాంగ్రెస్ ప్లోర్ లీడర్ అన్వర్ ఏకగ్రీవంగా ఆమోదించారు. ముసాయిదా రుపొందించిన డిజైన్ డెవలప్ మెంట్ ఫోరం, డీటీసీపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తీర్మాణం కాపీని ప్రభుత్వానికి పంపారు. మాస్టర్ ప్లాన్ లో తప్పులు ఉన్నందునే రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పిన ఛైర్ పర్సన్ జాహ్నావి… విలీన గ్రామాల్లో ఇండస్ట్రీయల్ జోన్ చేర్చేందుకు అంగీకరించమని స్పష్టం చేశారు ఛైర్ పర్సన్. ఇటు మున్సిపల్ పాలకవర్గం చేసిన తీర్మాణం పట్ల రైతు జేఏసీ సంతృప్తి వ్యక్తం చేసింది. గ్రామాల్లో టపాసులు కాల్చి రైతులు సంబరాలు చేశారు. రైతుల విజయంగా ప్రకటించారు….( స్పాట్ విజువల్స్ బైట్స్)

కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం.. 2021 మార్చి 27న నూతన మాస్టర్ ప్లాన్ ముసాయిదాను.. ప్రభుత్వానికి పంపింది. ముసాయిదా పై అభ్యంతరాలు స్వీకరించాలని ఆదేశించింది. రెండు పంటలు పండే రైతుల భూముల్లో గ్రీన్ జోన్, ఇండస్ట్రీయల్ జోన్, రిక్రియేషన్ జోన్స్ ఏర్పాటు ప్రతిపాదనలపై రైతులు భగ్గుమన్నారు. 2300 మంది కి పైగా రైతులు డ్రాప్ట్ మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తెలిపారు. కలెక్టరేట్ ముట్టడితో పాటు ధర్నా, రాస్తారోకోలు, మున్సిపల్ ముట్టడి, కలెక్టరేట్ లో వంటా వార్పు, కామారెడ్డి బంద్ లాంటి ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాస్టర్ ప్లాన్ లో తన భూమి పోతుందనే బెంగతో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం, మరో రైతు ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో.. రైతుల ఉద్యమం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. 50 రోజులుగా అనేక రూపాల్లో నిరసన తెలిపిన 150 మంది రైతుల పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కౌన్సిలర్ల రాజీనామాకు డెడ్ లైన్ పెట్టడంతో.. బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు రాజీనామాలకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే.. కామారెడ్డి బల్దియా పాలకవర్గం.. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ తీర్మాణం చేశారు. కౌన్సిల్ తీర్మాణం స్వాగతించిన రైతు ప్రతినిధులు.. ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటిస్తూనే.. రైతులకు ఇబ్బంది పెట్టకుండా కొత్త మాస్టర్ ప్లాన్ రైతుల అభిప్రాయం మేరకు రూపొందించాలని కోరారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ పాలకవర్గం తీర్మాణం చేయడం, పక్రియ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు సంబరాలు చేసుకోగా.. పోలీసులు, మున్సిపల్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here