89 ఏళ్ల వయస్సులోనూ లైంగిక వేధింపులు.. భర్తపై ఫిర్యాదు చేసిన భార్య

0
704

ఒక్కొక్కరికి ఒక్కో యావ ఉంటుంది.. వయస్సు పైబడినవారు కొందరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలపై దృష్టి పెడితే.. ఇంటి పట్టునే ఉండే పండుటాకులు కొందరు మాత్రం లైంగిక కోరికలు చంపుకోలేక.. 90 ఏళ్లకు దగ్గరైనా ఇంట్లోవారిని లైంగికంగా వేధిస్తున్నారు.. ‘చింత చచ్చినా పులుపు చావలేదు’ అనే సామెత వినే ఉంటారు.. ఇప్పుడో ముసలోడి వ్యవహారం కూడా అలాగే ఉంది.. 89 ఏళ్లు వచ్చి కాటిక కాలు చాపే వయస్సు ఉన్నా.. కోరికలు మాత్రం బుస కొడుతున్నాయట.. తన 87 ఏళ్ల భార్యను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడట.. ఈ విషయం విని అంతా నోరువెళ్లబెట్టారు.. సెక్స్ కోసం భర్త పదేపదే డిమాండ్ చేయడంతో విసుగు చెంది 87 ఏళ్ల బామ్మ.. హెల్ప్‌లైన్ సెంటర్‌కు ఫోన్‌ చేసింది.. తన 89 ఏళ్ల భర్త సెక్స్ డిమాండ్ గురించి ఫిర్యాదు చేసింది ఆమె..

వడోదరకు చెందిన 87 ఏళ్ల బామ్మ.. తన 89 ఏళ్ల భర్త సెక్స్ కోసం పదేపదే డిమాండ్ చేయడంతో విసిగిపోయి కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసింది.. గుజరాత్‌లోని మహిళలందరికీ అభయం పేరుతో 181 టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. అయితే, ఈ మధ్యే ఆ టీమ్‌కి కాల్ వచ్చింది. అది కూడా ఓ సంపన్న కుటుంబం నుండి వచ్చింది. 87 ఏళ్ల వృద్ధురాలు తనకు ఎదురైన కష్టాలను వివరిస్తూ, తన భర్త వేధింపుల నుంచి తనను కాపాడాలని వేడుకోవడంతో ఆ కాల్‌ రిసీవ్‌ చేసుకున్నవారు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా భర్త వయస్సు 89 సంవత్సరాలు.. రిటైర్డ్‌ ఇంజినీర్‌ అయినతో కలిసి వడోదరలోని సయాజిగంజ్ ప్రాంతంలో నివసిస్తున్నాం.. నన్ను పదే పదే తన కోరికలు తీర్చాలని ఒత్తిడి చేస్తున్నాడు.. నిరాకరిస్తూ.. భర్త తన నిగ్రహాన్ని కోల్పోతాడని, తనపై అరుస్తూ, దూషిస్తాడని భార్య అభయం బృందంతో పంచుకుంది. అనారోగ్యంతో ఉన్నా.. మరియు అలసటతో ఉన్నప్పటికీ, తన భర్త లైంగిక చర్యకు డిమాండ్‌ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడని.. తన వ్యక్తిగత విషయాన్నిహెల్ప్‌లైన్ ముందు మొరపెట్టుకుంది బామ్మ.. ఈ కాల్‌ రిసీవ్‌ చేసుకున్ని షాక్‌ తిన్న అభయం బృందం.. వారి ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చింది.. ఈ వయస్సులో యోగా సాధన చేయాలి.. మతపరమైన ప్రదేశాలను సందర్శించాలని.. భర్తను కోరినట్లు ఆ బృందం పేర్కొంది. తన కోరికలను మరియు మనస్సును మళ్లించడానికి సీనియర్ సిటిజన్స్ గార్డెన్స్ మరియు పార్కులను సందర్శించాలని కూడా ఆ ముసలోడికి సూచించారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here