అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధింపు

0
618

అరుకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను అరెస్ట్‌ చేశారు సీబీఐ అధికారులు… ఇవాళ హైదరాబాద్‌లో కొత్తపల్లి గీతను అదుపులోకి తీసుకున్న సీబీఐ టీమ్.. బెంగళూరుకు తరలించింది… అయితే, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి రూ. 52 కోట్లు లోన్‌ తీసుకునుఒ ఎగ్గొట్టినట్టు గీత దంపతులపై అభియోగాలున్నాయి… విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొత్తపల్లి గీత దంపతులు.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి రూ. 52 కోట్లు రుణంగా తీసుకున్న కొత్తపల్లి గీత దపంతులు.. తిరిగి చెల్లించని కారణంగా.. సంబంధిత బ్యాంకు అధికారుల ఫిర్యాదు చేశారు.. దీంతో.. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు గీతను అరెస్ట్ చేశారు.

2015లో పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ ఫిర్యాదు మేరకు కొత్తపల్లి గీతపై కేసు నమోదు చేసింది సీబీఐ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.. గీతతో పాటు ఆమె భర్త, హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ ఎండీపై కూడా కేసు నమోదైంది.. వీరి కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ42.79 కోట్లు నష్టం వాటిల్లందని చార్జిషీట్ లో పేర్కొంది సీబీఐ.. మాజీ ఎంపీకి సహకరించిన బ్యాంక్ అధికారులపై కూడా కేసులు పెట్టింది… ఐపీసీ 120, 420, 458, 421, 13(2), రెడ్ విత్ 1(సి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సీబీఐ.. ఇప్పుడు కొత్తపల్లి గీతను అరెస్ట్ చేసింది. ఇక, కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించిన సీబీఐ కోర్టు.. రుణాల పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో జైలు శిక్ష విధించింది.. కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు ఐదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించింది.. బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్ కూ ఐదేళ్ల శిక్ష పడింది.. విశ్వశ్వర ఇన్ ఫ్రా ప్రై.లి.కు రూ.2లక్షల జరిమానా విధించిన సీబీఐ కోర్టు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here