తెలంగాణను భారీవర్షాలువ వీడడం లేదు. నిన్న వాయువ్య బంగాళాఖాతం మరియు పరిసరప్రాంతాల్లో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు దక్షిణ కోస్తా ఒడిశా & పరిసర ప్రాంతాలకు విస్తరించి దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ పైన విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి వైపు వంగి ఉంటుంది. రుతుపవన ద్రోణి ఇప్పుడు బికనీర్, కోటా, రైసెన్, మలంజ్‌ఖండ్, రాయ్‌పూర్, కేంద్రంగా వెళుతుంది. దక్షిణ కోస్తా ఒడిశా & పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం కేరంద్రం ద్వారా ప్రయాణిస్తూ , ఆ గ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది. తూర్పు -పడమర గాలుల కోత ఉత్తర భారత ద్వీపకల్ప మైన 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ & 7.6 కి.మీ విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణము వైపు వంగి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు భద్రాచలం దగ్గర గోదారమ్మ పరవళ్ళు తొక్కుతోంది.
భద్రాచలంలో అత్యధికంగా గోదావరి వరద నీటిమట్టం నమోదైన సంవత్సరాలు ఇలా వున్నాయి.
1976- 63.9 అడుగులు
1983- 63.5 అడుగులు
1986-75.6 అడుగులు
1990- 70.8 అడుగులు
1994- 58.6 అడుగులు
1995- 57.6 అడుగులు
2006- 66.9అడుగులు
2010 – 59.7అడుగులు
2013- 61.6 అడుగులు
2014- 56.1 అడుగులు
2022-61.6 అడుగులుగా వుంది. మరింత పెరిగే ప్రమాదం వుండడంతో తెలంగాణనుంచి ఆంధ్రాకు, ఆంధ్రా నుంచి తెలంగాణకు రాకపోకలు నిషేధించారు. నదీపరివాహక ప్రాంతాల వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.