జనసేన డిజిటల్‌ ఉద్యమం.. ట్రెండింగ్‌లో #GoodMorningCMSir

0
947

అసలే ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది.. దీనిపై పక్క రాష్ట్రాల మంత్రులు, నేతలు కూడా కామెంట్ చేశారు.. చిన్నజీయిర్ స్వామిలాంటి వాళ్లు కూడా కొన్నిసార్లు రోడ్ల ప్రస్తావన తీసుకొచ్చారు.. ఇక, రాష్ట్రంలోని రోడ్లను కొన్ని ప్రాంతాల్లో శ్రమదానంతో జనసేన పార్టీ తరపున కొంత బాగుచేసే ప్రయత్నాలు కూడా చేశారు.. ఆ తర్వాత సర్కార్‌ కదిలినట్టు.. జనసేన తన సోషల్‌ మీడియాలో హ్యాండిల్స్‌లో కొన్ని ఫొటోలను షేర్‌ చేసిన విషయం తెలిసిందే.. అయితే, గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మరింత అద్వానంగా తయారైంది రోడ్ల పరిస్థితి.. ఇదే సమయంలో.. డిజిటల్‌ క్యాంపెయిన్‌కు పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. #GoodMorningCMSir హాష్‌ ట్యాగ్‌ జోడిస్తూ.. మీ ప్రాంతంలోని రోడ్ల పరిస్థితి తెలియజేయాలంటూ పిలుపునిచ్చారు..

అయితే, జనసేన డిజిటల్‌ క్యాంపెయిన్‌కు సోషల్ మీడియా షేక్‌ అవుతోంది.. తన ప్రాంతంలోని రోడ్ల దుస్థితిని తెలియజేసే వీడియోలు, ఫొటోలను షేర్‌ చేస్తూ.. #GoodMorningCMSir హాష్‌ ట్యాగ్‌ తగిలిస్తూ దుమ్ములేపుతున్నారు జనసైనికులు.. పార్టీ శ్రేణులతో పాటు.. మరికొంత మంది నెటిజన్లు కూడా ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తున్నారు.. దీంతో, ట్విట్టర్‌ లో హాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.. ఇండియాలో ట్రెండ్‌ అవుతోన్న 10 టెన్‌ హాష్ ట్యాగ్‌ల్లో కొన్ని గంటల తరబడి ట్రెండ్‌ అవుతూనే ఉంది.. కొన్నిసార్లు టాప్‌ టూ వరకు వచ్చిన ఈ హాష్‌ ట్యాగ్‌పై మధ్యాహ్నం 2 గంటల వరకు 252 వేలకు పైగా ట్వీట్లు చేశారు నెటిజన్లు.. రోడ్ల పరిస్థితిని కొందరు ఏకరువు పెడుతూ ఫొటోలు షేర్‌ చేస్తే.. మరికొందరు రోడ్లపై ఉన్న నీటి గుంటల వద్ద నిరసన తెలియజేస్తున్నారు.. మరికొందరు సీఎం మొద్దు నిద్ర వీడాలంటూ కామెంట్లు పెడుతున్నారు.. మొత్తంగా ఏపీలోని రోడ్ల పరిస్థితిపై దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది #GoodMorningCMSir హాష్ ట్యాగ్‌..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here